జగదీష్ రెడ్డికి ఛాలెంజ్?

నాాగార్జున సాగర్ ఉప ఎన్నికలో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీకి ఈ ఎన్నికలో ఎలాగైనా గెలిచేందుకు అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నది. ఎవరికి కావాల్సింది వాళ్లకు అందజేస్తూ ముందుకు దూసుకెళుతున్నారు. తాజాగా, మరో పద్దెనిమిది నెలల్లో నెల్లికట్టు పూర్తి చేయకపోతే మంత్రి పదవీకి రాజీనామా చేస్తానన్న జగదీష్ రెడ్డి ప్రకటన ఏబీవీపీ లీడర్ కి తెగ నచ్చేసిందట. అందుకే అతని జగదీష్ రెడ్డికి ఛాలెంజ్ చేశాడు.

66
ABVP LEADER WILL CAST TO TRS
ABVP LEADER WILL CAST TO TRS

BVP నాయకుడి సంచలన ప్రకటన

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో

కొత్త చర్చకు తెర లేపిన ABVP నేత ప్రకటన

’’ అవునూ నేను ఏబీవీపీనే.. ఉస్మానియా యూనివర్సిటీ ఏబీవీపీ లీగల్ సెల్ కన్వీనర్ ను కూడా అయితేనేం.. నిర్ణిత గడువు లోపు నెల్లికల్లు లిఫ్ట్ పూర్తి చేయకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ మంత్రి జగదీష్ రెడ్డి వాగ్దానం చేశారు. నాకు కావాల్సింది నెల్లికల్లు లిఫ్ట్ పూర్తి చెయ్యడమే.. మా తాతల కాలం నాడు నాగార్జున సాగర్ నిర్మించారు. నాలుగో తరానికి చెందిన వాడను నేను.. మా ఊరు సాగర్ ను అనుకుని ఉంటుంది. తలాపునా సముద్రం ఉంది అయినా లాభం లేదు.. ముఖ్యమంత్రి కేసీఆర్ మా కలలను సాకారం చేసే విదంగా లిఫ్ట్ కు శంకుస్థాపన చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మా ఊరికి వచ్చిన మంత్రి జగదీష్ రెడ్డి 18 నెలలలో పూర్తి చెయ్యకపోతే రాజీనామా చేస్తామని భరోసా ఇచ్చారు. ఆ భరోసా నచ్చింది. ఏబీవీపీలో ఉన్నా నాకు మంత్రి ప్రకటన నచ్చింది.. అందుకే ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకీ ఓటు వేయాలని నిర్ణయించుకున్నాను. అంతే కాదు మంత్రి జగదీష్ రెడ్డి చెప్పిన గడువు లోపు నెల్లికల్లు లిఫ్ట్ పూర్తి అయితే వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా నా ఓటు టీఆర్ఎస్ కేనని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏబీవీపీ లీగల్ సెల్ కన్వీనర్ బ్రాహ్మరెడ్డి స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here