మల్కాజ్‌గిరి ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడులు

48
ACB Attacks on ACP Malkajgiri
ACB Attacks on ACP Malkajgiri

ACB Attacks on ACP Malkajgiri

ఏసీబీకి మరో తిమింగళం చిక్కింది. మల్కాజ్ గిరి ఏసీబీ నరసింహారెడ్డి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలతో సోదాలు చేసింది. నరసింహారెడ్డి గతంలో ఉప్పల్‌ సీఐగా పని చేశారు. పలు భూ వివాదాలతో పాటు సెటిల్‌మెంట్లలో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ ఐజీ చంద్రశేఖ‌ర్‌రెడ్డి అల్లుడు అయిన ఏసీపీ న‌రసింహారెడ్డి రూ.50 కోట్ల అక్రమాస్తులు సంపాదించిన‌ట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌లో 20చోట్ల ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక ఒకే సమయంలో ఏసీబీ అధికారులు 34 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. వరంగల్‌ జిల్లాలో మూడు చోట్ల, కరీంనగర్‌, నల్గొండ జిల్లాల్లో రెండు చోట్ల, ఏపీలోని అనంతపురంలో ఒక చోట అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. నరసింహా రెడ్డితో పాటు అతని కుటుంబీకుల ఇళ్లల్లో ఏసీబీ సోదాలు చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here