కాప్రా డీఈని ఏసీబీ ట్రాప్

65

కాప్రా మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న DE మహాలక్ష్మిని ఏసీబీ ట్రాప్ చేసింది. ఆమె 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి అడ్డంగా దొరికిపోయింది. పేద ఉద్యోగి బిల్ మంజూరు చేయడం కోసం 20 వేలు లంచం డిమాండ్ చేసంది. మల్లాపూర్ చౌరస్తాలో ఒక హోటల్ లో డబ్బులు తీసుకుంటు పట్టుబడింది. కాప్రా మున్సిపాలిటీ కార్యాలయంలో, ఆమె నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ మున్సిపాలిటీలో అక్రమార్కుల సంఖ్య ఎక్కువేనని ప్రజలు తరుచూ ఆరోపిస్తున్నారు. అనుమతి కావాలన్నా.. ఓసీ కావాలన్నా.. అసలే పని కావాలని చేయి తడపనిదే ఇక్కడి సిబ్బంది పని చేయరని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకూ తెలుసు. అయినా, అక్రమ అధికారులు, సిబ్బందిని కట్టడి చేయలేకపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here