సింగరేణిలో ప్రమాదం – నలుగురు గల్లంతు

56
#Accident in Singareni#
#Accident in Singareni#

#Accident in Singareni#

సింగరేణి బొగ్గు గనిలో గురువారం సాయంత్రం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు గల్లంతు అయినట్టు సమాచారం. రామగుండం డివిజన్ పరిధిలోని వకీల్‌పల్లి భూగర్భ బొగ్గు గనిలో జంక్షన్ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో పనిచేస్తున్న నలుగురు కార్మికులు గల్లంతు అయినట్టు అక్కడివాళ్లు చెప్తున్నారు. విషయం తెలుసుకున్న సింగరేణి యాజమాన్యం సహాయక చర్యలు చేపట్టింది. గల్లంతు అయినవాళ్ల కోసం సహాయ చర్యలు ముమ్మురంగా కొనసాగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here