Accused Chinna Keshav Mother Statement
వెటర్నరీ వైద్యురాలు ప్రియాంకారెడ్డి హత్య కేసులో నిందితుడైన చెన్నకేశవులు నిజంగా తప్పుచేసి ఉంటే వాడికి ఏ శిక్ష విధించినా పర్వాలేదని అతని తల్లి జయమ్మ తెలిపింది. నాకు ఆడపిలల ఉంది ఏ తల్లిది అయినా బాధేనని ప్రియాంకను చంపిన విధంగా వాడినీ చంపాలని సూచించింది. ప్రియాంకపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఘటనలో నిందితులైన నలుగురిలో చింతకుంట చెన్నకేశవులు నాలుగో నిందితుడు. నిందితులను ఉరితీయాలంటూ మహిళా లోకం ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో జయమ్మ నోట కూడా అదే మాట వచ్చింది.’నేను మాత్రమే తొమ్మిది నెలలు మోసి బిడ్డల్ని కనలేదు. నాకూ ఆడపిల్లలు ఉన్నారు. ప్రియాంక కుటుంబ సభ్యుల ఆవేదన అర్థం చేసుకోగలను. నా కొడుకు ఇట్లా చేస్తాడని అనుకోలేదు. జులాయిగా తిరిగే మహ్మద్ ఆరిఫ్ తో కలిసి తిరగడం వల్లే వాడు కూడా పాడై పోయాడు. ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. అయ్యిందేదో అయ్యిందిలే అని సరి పెట్టుకున్నాం. ఇప్పుడింత పని చేస్తాడనుకోలేదు. ఊరంతా మా గురించే మాట్లాడుకుంటే తలదించుకోవాల్సి వస్తోంది. ఆవమానం భరించలేక నా భర్త ఆత్మహత్యా యత్నం కూడా చేశాడు. అటువంటి కొడుకు ఉంటే ఎంత? పోతే ఎంత? వాడికి ఉరిశిక్ష వేస్తారో? కాల్చి చంపుతారో? వాళ్ల ఇష్టం’ అంటూ జయమ్మ కన్నీటి పర్యంతమవుతూ చెప్పింది.మృగాలు సైతం సిగ్గుపడేలా ప్రవర్తించిన డాక్టర్ ప్రియాంకా రెడ్డి కేసు నిందితులకు ఇంటా, బయట వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. సభ్య సమాజం సిగ్గుపడేలా చేసిన ఈ ఘటనపై సర్వత్రా మండిపడుతున్నారు. తమకు కూడా ఆడపిల్లలు ఉన్నారని… ఏ తల్లికీ ఇలాంటి కష్టం రావొద్దని’ చెన్న కేశవులు తల్లి స్పష్టం చేసింది. తన కొడుకును చంపేయాలని కోరింది. వైద్యురాలిని చంపినట్టే తన కొడుకును కూడా చంపెయ్యాలని తెలిపింది. ఇంత పెద్ద తప్పు చేసిన తన కొడుకును ఏం చేసినా అడ్డుపడమని చెన్నకేశవులు తల్లి చెబుతోంది. “నా కొడుకు మంచివాడే..కానీ, ఇలా చేస్తాడని ఎప్పుడూ అనుకోలేదు. ప్రేమ పెళ్లి చేసుకున్నా అడ్డుచెప్పలేదు. స్నేహితులతో తిరగడం వల్లే వాడు ఇలా తయారయ్యాడు. మహ్మద్ ఆరిఫ్ స్నేహం నా కొడుకును పాడు చేసింది. ఎప్పుడూ వచ్చి లారీ పనికి తీసుకెళ్లేవాడు. అలా వెళ్ళిన క్రమంలోనే తాగిన మైకంలో ఏం చేశాడో మాకు తెలియదని వాపోయింది.