Accused forced victim to drink alcohol
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశంలో సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి గ్యాంగ్ రేప్, హత్య కేసును పోలీసులు 48 గంటల్లోనే చేయించారు. లారీ డ్రైవర్లు, క్లీనర్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రియాంక చౌదరి తన సోదరి భవ్య కు చేసిన ఫోన్ కాల్ ఆధారంగా, సిసి టీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకొని కేసును త్వరితగతిని ఛేదించారు. ఇక ఈ కేసుకు సంబంధించి ప్రియాంక రెడ్డి పై గ్యాంగ్ రేప్ చేసిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేశారు. దీంతో ప్రియాంక రెడ్డి హత్య కేసులో దారుణమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. రాత్రి 9.30 నుండి వారు జరిపిన రాక్షస క్రీడ ఇలాంటి సమాజంలో ఉన్నామా అన్న బాధను కలిగిస్తుంది.
పక్కా ప్లాన్ ప్రకారమే గ్యాంగ్ రేప్ చేసిన నలుగురు మానవ మృగాలు తొండుపల్లి టోల్ ప్లాజా సమీపంలో ప్రియాంక బైక్ పార్క్ చేయడాన్ని గమనించారు. స్కూటీ పార్క్ చేసి వెళ్లగానే నవీన్ వెళ్లి టైర్లో గాలి తీసేశాడు.. ప్రియాంక వచ్చిన తర్వాత ఎలా హ్యాండిల్ చేయాలి అనేదానిపై ముందుగానే ఒక ప్లాన్ వేసుకున్నారు. ప్రియాంక తిరిగి 9.18కి టోల్ ప్లాజా దగ్గరకు వచ్చింది.. బండి పంక్చర్ అయ్యిందని.. సహాయం చేస్తామని ఆమెను మాటల్లో పెట్టారు.. 9.22కి చెల్లికి ఫోన్ చేసి బైక్ పంక్చర్ అయిన విషయం చెప్పింది.. రాత్రి 9.48కి ప్రియాంక ఫోన్ స్విచాఫ్ అయ్యింది. ఇక పథకం ప్రకారం ఆరిఫ్ ప్రియాంకను నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లాడు.. రాత్రి 9.48 నుంచి రాత్రి 10.08 గంటల వారు ప్రియాంక పై అత్యాచారానికి పాల్పడ్డారు..ఆ రోజు మధ్యాహ్నం నుండే ఫుల్లుగా మద్యం సేవించి ఉన్నవారు ఆమెపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఆ తరువాత ఆమె నోరు మూసి అత్యాచారం చేశారు.
ఆమె హెల్ప్ హెల్ప్ అని అరుస్తుండటంతో ఆమెకు బలవంతంగా మద్యం తాగించారు. దీంతో ప్రియాంక రెడ్డి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. పూర్తిగా మద్యం మత్తులో ఉన్న నరరూప రాక్షసులు ఏం చేస్తున్నారో అర్థం కాని స్థితిలో ప్రియాంక రెడ్డి ముక్కు, నోరు గట్టిగా మూయడంతో ఆమె మరణించింది.అక్కడి నుంచి ప్రియాంక రెడ్డి మృతదేహాన్ని రాత్రి 10.33కి లారీని తీసుకొని బయల్దేరారు. మృత దేహాన్ని క్యాబిన్ లో వేసుకొని పలుమార్లు మృతదేహంపై అత్యాచారం చేశారని తెలుస్తుంది.మృతదేహంపైన కూడా కామవంచ తీర్చుకున్న పశు ప్రవృత్తికి సభ్య సమాజం నివ్వెరపోతుంది . ఆ తరువాత ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టారు. పోలీసుల విచారణలో తెలిసిన ఈ నిజాలు వింటుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మన మధ్యనే నిత్యం తిరుగుతూ ఇలాంటి నరరూప రాక్షసులు ఉన్నారా అని భయం కలుగుతుంది. మృతదేహాన్ని కూడా వదలని వాళ్ళ స్వభావం వారిలోని పైశాచికత్వానికి పరాకాష్ట గా నిలిచింది. ప్రియాంక రెడ్డి ఊహించని విధంగా నలుగురు కామాంధులు తన మీద దాడి చేస్తుంటే ఈ బాధను ఎలా భరించిందో తలచుకుంటేనే భయం కలుగుతుంది.