నటన నేర్చుకోవాలంటే బట్టలు విప్పాలట

Acting studio Issue

సినిమాలో నటించడానికే కాదు, నటన నేర్చుకోవడానికి కూడ బట్టలు విప్పాలని చెప్పి లైంగిక వేధింపులకు గురి చేస్తున్న యాక్టింగ్ స్టూడియో ఘటన సినీ ఇండస్ట్రీ వర్గాలను షాక్ కు గురి చేసింది . సినిమాలో నటించాడానికి ఎలాగు లైంగిక వేధింపులు ఉన్న విషయం అందరికి తెలిసిందే ,కాని సినిమాలో ఎంట్రి ఇవ్వడానికి కావాల్సిన నటనలో సైతం లైంగిక వేధింపులు మొదలయ్యాయి. ఇప్పటికే సిని ఇండస్ట్రీపై శ్రీరెడ్డి అనే నటి చేసిన నిరసన అందరికే తెలిసిందే, నేరుగా రోడ్డు మీదకు వచ్చి ఆమే బట్టలు విప్పి నిరసన వ్యక్తం చేసింది. తాజగా వచ్చిన ఆరోపణ మాత్రం, నటన నేర్పే ఇనిస్టిట్యూట్ లో సైతం బట్టలు విప్పి నటించమని చెబుతున్నారని ఓ యువతి తన ఆవేదనను మీడియా ముందు ఉంచింది.
హైద్రాబాద్ హిమాయత్ నగర్ లో సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ ఉంది. దానికి వినయ్ వర్మ అనే వ్యక్తి డైరక్టర్ గా ఉన్నారు. ఇందులో అచింత కౌర్ చద్దా అనే యువతి ఇటివలే నటన నేర్చుకోవడానికి చేరింది. ఇనిస్టిట్యూట్ లో రోజుకు రెండుగంటల పాటు శిక్షణ ఇస్తారు. ఇందులో భాగంగానే మంగళవారం ఉదయం డైరక్టర్ వినయ్ వర్మ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలోనే ఇనిస్టిట్యూట్ తలుపులు మూయించిన వినయ్ వర్మ అందులో ఉన్న యువతి యువకులను బట్టలు విప్పమని చెప్పారని అచింత కౌర్ తెలిపింది. దీంతో ఖంగుతిన్న అచింత కౌర్ తాను బట్టలు విప్పనని చెప్పడంతో ఆమెను తిట్టి బయటకు వెళ్లమని చెప్పారట ,అయితే అక్కడ ఉన్న మరో యువతితోపాటు యువకులు బట్టలు విప్పారని చెప్పింది., ఇదే విషయమై షీ టీమ్ కు ఫిర్యాదు చేసినట్టు ఆమె తెలిపింది. అయితే పోలీసులు కూడ కేసు నమోదు చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పెట్టారని ఆమె వాపోయింది .

Related posts:

చట్టసభలోకి రంగీల
మీస్ టీన్ గా తెలుగు అమ్మాయి
పెళ్లికి కూడా లీవ్ తీసుకోలేదు : వరుడే వచ్చి తాళి కట్టాడు
ఫాం హౌజ్ టు బిగ్ హౌజ్ : తన యాసతో నవ్విస్తున్న గంగవ్వ
ఐటీ మహిళకొచ్చిన కష్టం పగవాడికీ రావొద్దు
అలరించిన కుమారి రమ్యా భరతనాట్యం
వీడు తండ్రా? కాదు మానవమృగం..
తిరుమలలో కేసీఆర్ కి గ్రాండ్ వెల్కమ్
తొమ్మిదోతరగతి బాలిక అత్యాచారం
పార్లమెంట్ ఎన్నికల బరిలో నేషనల్ ఉమెన్స్ పార్టీ
బలవంతంగా తాళి కట్టి ఆపై చిత్రహింసలు పెట్టిన ఘనుడు
మహిళలకు 33 శాతం సీట్లిస్తామని ప్రకటించిన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్
స్థానిక సంస్థల్లో మహిళలకు పెద్ద పీట వేసిన తెలంగాణా సర్కార్
మహిళా ఉద్యోగులకు సెలవు
  మహిళా ఉద్యోగులపై రక్షణా శాఖ కీలక నిర్ణయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *