Action Party for 48 days long
గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై అనీల్ సుంకర నిర్మాణంలో అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్ సహనిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను ఈ నెల 21న రాజస్థాన్‌లో స్టార్ట్ చేయబోతున్నారు. జైపూర్‌లో ప్రారంభం కాబోయే ఈ షెడ్యూల్ 45 రోజుల పాటు ఉంటుందట. ప్రస్తుతం చిత్ర యూనిట్ హీరోయిన్స్‌ను ఫైనలైజ్ చేసే పనిలో బిజీగా ఉంది. ఇద్దరు హీరోయిన్స్ నటిస్తారని సమాచారం. ఈ సినిమా తర్వాత గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్‌లో సినిమా స్టార్ట్ అవుఉతంది.