టీడీపీ లో చేరనున్న ఆలీ.

Actor Ali Joins TDP – అందుకేనా గంటాతో భేటీ

కమెడియన్ ఆలీ ఏ పార్టీ లో చేరతారో తేలిపోయింది అనిపిస్తుంది. సుదీర్ఘ కాలంగా సంబంధం ఉన్న టీడీపీ లోనే ఆలీ కొనసాగానున్నారనే సమాచారం తెలుస్తోంది. కొద్ది రోజులు సినీ నటుడు ఆలీ ఏ పార్టీలో చేరుతార‌నే చ‌ర్చ సాగుతోంది. ఆలీ పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు కావటంతో ఆయన జన్సేనకు జై కొడతారు అనుకున్నారు. అలా ఆలీ కూడా జనసేనాని వెంట నడిచారు. అయితే జగన్ తో అకస్మాత్తుగా కలిసిన ఆలీ జగన్ ల ఫోటోలు వైరల్ కావటంతో ఆలీ వైసీపీలో చేరుతున్నారని భావించారు. మళ్ళీ టీడీపీ అధినేత చంద్రబాబును ఆల్లీ కలిసి మంతనాలు చేశారు. ఇదంతా చూస్తున్న పవన్ సైతం ఆలీతో భేటీ అయ్యి తమ పార్టీ నుండి పోటీ చెయ్యమని చెప్పారు. ఇక ఎటూ తేల్చుకోలేక ఇబ్బంది పడిన ఆలీ తాజాగా ఏపీ మాత్రి గంటా శ్రీనివాసరావును కలవటం ఆయన తో భేటీ కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక‌, ఇప్పుడు ఆలీ రాజ‌కీయ అడుగుల పై దాదాపు స్ప‌ష్ట‌త వ‌చ్చింది. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌టం దాదాపు ఖాయ‌మే..పార్టీ సైతం దాదాపు ఫైన‌ల్‌ అయ్యిందని తెలుస్తుంది.
సినీ న‌టుడు ఆలీ 20 ఏళ్ల కాలంగా రాజ‌కీయంగా టిడిపి లో ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ కార్య‌క్ర‌మాల్లోనూ పాల్గొన్నారు. ఇక ఎన్నికల్లో పోటీ చెయ్యటానికి టికెట్ కోసం ఆ పార్టీ ఈ పార్టీ అని తర్జన భర్జన పడుతున్న ఆలీ ఈ స‌మ‌యంలోనే..స‌డ‌న్ గా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తో స‌మావేశం అయ్యారు. అయితే చంద్ర‌బాబు ఆహ్వానం మేర‌కు ఆలీ వెళ్లి క‌లిసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో..ఆలీ ఇక టిడిపి లోనే ఉంటార‌నే వార్త‌లు ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి . ఈ ప‌రిస్థితుల్లో ఆలీ రాజ‌కీయంగా త‌న‌కు స‌న్నిహితుడైన మంత్రి గంటా తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు.గంటాతో మంచి సాన్నిహిత్యం వుండటం, గంటా కు గతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించటం తో ఆలీ గంటానుకలిసి తానూ చెప్పదలుచుకుంది చెప్పారు.
ఇక ఆలీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సూచ‌న మేర‌కు టిడిపిలోనే కొన‌సాగాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న‌కు గుంటూరు తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుండి సీటు దాదాపు ఫైనల్ అయినట్టే అని తెలుస్తుంది. అయితే, జ‌నసేన కాద‌ని టిడిపి లో చేరితే పవన్ కు ఏం చెప్పాలనే దానిపైనే ఆలీ ఈ స‌మావేశంలో గంటా తో చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. పార్టీ ప‌రంగా రాజకీయ భ‌విష్య‌త్ ఉంటుంద‌ని భావించే ఆలీ ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది. ఇక టీడీపీ నుండి ఇచ్చిన ఆఫర్ చెప్పి ఇది ముఖ్య‌మంత్రి మాట‌ని మంత్రి గంటా ఆలీకి చెప్పుకొచ్చిన‌ట్లు స‌మాచారం. దీంతో.. మ‌రో సారి ప‌వ‌న్ క‌ళ్యాన్ తో ఆలీ భేటీ అయ్యి ఆయనకు తానూ చెప్పుకునేది చెప్పి త్వ‌రలోనే ఆలీ తాను ఏ పార్టీలో కొన‌సాగేదీ స్ప‌ష్ట‌త ఇచ్చే అవకాశం వుంది.
ఇక గంటాను కలుసుకున్న ఆలీ మీడియాతో మాట్లాడుతూ.. తనకు పోటీ కి అవకాశం ఇచ్చే పార్టీ కి జై కొడతానని చెప్పారు. జనవరి 16 వరకు రోజులు బాగాలేవని తన గురువు చెప్పారని, ఆ తేదీ తరువాతే తాను ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానని తెలిపారు.. టీడీపీ అంటే తనకు అభిమానమని, సీఎం చంద్రబాబుతో సహా పలువురు మంత్రులతో తనకు పరిచయాలున్నాయని, తనను వారు ఓ సోదరుడిలా చూసుకుంటారని పేర్కొన్నారు ఆలీ . అలాగే, మంత్రి గంటాకు తాను చెప్పాల్సింది చెప్పానని చెప్పిన ఆలీ ఆయన తనను సిఫారసు చేస్తారని భావిస్తున్నానని చెప్పారు. ఇక తన మాటలతో ఆయన పరోక్షంగా టీడీపీలో చేరుతాననే సంకేతాలిచ్చారు. అంతేకాదు, తాను 20 ఏళ్ల నుంచి కార్యకర్తగానే ఉన్నానని, ఇక అభ్యర్థిగా ఉండాలన్నది తన అభిమతమని కూడా చేసిన వ్యాఖ్య అందుకు ఊతమిస్తోంది. అనంతరం మంత్రి గంటా మాట్లాడుతూ.. అలీ గురించి ముఖ్యమంత్రికి తెలుసని, ఆయన ఉద్దేశాలను చంద్రబాబు పరిగణనలోకి తీసుకుంటారని భావిస్తున్నానని వివరించారు. తాను కూడా ముఖ్యమంత్రికి చెప్పాల్సినవి చెబుతానన్నారు. గుంటూరు నుంచి పోటీ చేయడానికి అలీ ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. మొత్తానికి ఆలీ కి లైన్ క్లియర్ అయ్యింది. అన్ని పార్టీలు తిరిగి హడావిడి చేసిన ఆలీ అనుకున్నది సాధించుకున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article