వయనాడ్,ఆగస్ట్5: ప్రకృతి సృష్టించిన విలయానికి కేరళలోని వయనాడ్ అతలాకుతలమైంది. ఈ కఠిన సమయంలో కొందరు యువత ప్రాణాలకు తెగించి, సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వారిలో పజ్రీశ్ కూడా ఒకరు. కొండచరియలు విరిగిపడటంతో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ప్రమాదాన్ని లెక్కచేయలేదు. ఎంతో మందిని కాపాడిన అతడి జాడ ఇప్పుడు తెలియకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి విపత్తు గురించి తెలియగానే వయ నాడ్‌లోని చూరాల్‌మలకు చెందిన పజ్రీశ్ రంగంలోకి దిగారు. తోటివారికి అవసరం అంటే ఏమాత్రం ఆలోచిం చకుండా సహాయం చేయడంలో ముందుంటారన్న పేరుంది. ముండక్కై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయని తెలియగానే, రక్షించేందుకు ప్రమాదకర కొండ ప్రాంత మార్గంలో జీప్‌లో వెళ్లారు.
అలా రెండుసార్లు పలువురిని కాపాడారు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమ య్యారు. అంతలోనే సహాయం కోసం మరో ఫోన్ కాల్ వచ్చి ంది. దాంతో మళ్లీ అదే ప్రాంతానికి జీప్‌లో వెళ్లి తిరిగి రాలేదు. చూరాల్‌మల ప్రాంతంలో ధ్వంసమైన జీప్ కనిపించింది. కానీ అతడి జాడ మాత్రం తెలియరాలేదని స్థానికులు వెల్లడించారు. పజ్రీశ్ అంటే అందరికీ ఇష్టం. మా ఇళ్లలో ఎలాంటి కార్య క్రమమైనా ముందుండి తనవంతు సహకారం అందిస్తాడు. నా కుమార్తె పెళ్లికి అతడు చేసిన సహాయం మరువలేనిది‘ అని మరొకరు తెలిపారు.
ఆ కొండ ప్రాంతానికి వెళ్లొద్దని చెప్పినా వినలేదని పజ్రీశ్ స్నేహితులు వెల్లడించారు. ముండక్కై ప్రాం తంలో చాలా మంది చిక్కుకుపోయారని, వారిని రక్షిం చాలంటూ వెళ్లాడని తెలిపారు. ‘అతడు మా సూపర్ హీరో. ఇప్పుడతడు మా ముందు లేడు‘ అంటూ వాపోయారు. కొండచరియలు విరిగిపడటంతో ముండక్కై, చూరాల్‌మల ప్రాంతాల్లో వందలాది ఇళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. ఆదివారం సాయంత్రం వరకు 222 మృతదేహాలను వెలికితీశారు. ఆచూకీ గల్లంతైనవారి సంఖ్య 180 వరకూ ఉంటుందని అధికారులు తెలిపారు.