ప్ర‌కాష్ రాజ్ క్లారిటీ ఇచ్చేశాడోచ్‌!

ACTOR PRAKASHRAJ

ఇండియ‌న్ సినిమాల్లో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ఇప్పుడు సామాజిక కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉన్నారు. సామాజిక మాధ్య‌మాల్లో జ‌స్ట్ ఆస్కింగ్ అంటూ కేంద్ర ప్ర‌భుత్వం, న‌రేంద్ర మోడిపై విమ‌ర్శ‌లు కూడా చేస్తుంటారు. ఇటీవ‌ల‌ ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్ రాజ్ ఏకంగా పోటీ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ప్ర‌కాష్ రాజ్ దాని గురించి త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా మరింత క్లారిటీ ఇచ్చారు. క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు సెంట్ర‌ల్ నుండి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేయ‌బోతున్నట్లు త‌న మ‌న‌సులో మాట‌ల‌ను బ‌య‌ట‌పెట్టాడు ప్ర‌కాష్ రాజ్‌. త‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశం గురించి త్వర‌లోనే మ‌రికొన్ని విష‌యాల‌ను ప్ర‌క‌టిస్తాన‌ని కూడా చెప్పుకొచ్చాడు ఈ విల‌క్ష‌ణ న‌టుడు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article