విషాదంలో హీరో శ్రీకాంత్ ..చిరంజీవి పరామర్శ

Actor Srikanth’s Father Passes Away

ప్రముఖ హీరో శ్రీకాంత్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన   తండ్రి మేక పరమేశ్వరరావు నిన్న రాత్రి 11 గంటల 45 నిమిషాలకు తుది శ్వాస విడిచారు.  గత కొంత కాలంగా లంగ్స్ కి సంబంధించిన జబ్బుతో బాధపడుతున్న ఆయన గత నాలుగు నెలలుగా హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ నిన్న కన్నుమూశారు.

తండ్రి మరణంతో హీరో శ్రీకాంత్ విషాదంలో మునిగిపోయారు.  దీంతో సినీవర్గాలు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాయి. పలువురు చలన చిత్ర ప్రముఖులు శ్రీకాంత్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. శ్రీకాంత్ కు మెగాస్టార్ చిరంజీవి తో ఉన్న సుదీర్ఘ అనుబంధం గురించి అందరికీ తెలుసు.చాలా చిరంజీవి సినిమాల్లో శ్రీకాంత్ నటించారు . ఈ నేపథ్యంలో చిరంజీవి శ్రీకాంత్ ఇంటికి వెళ్లి ఆయన తండ్రి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన  శ్రీకాంత్ ను, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

Actor Srikanth’s Father Passes Away,#actorsrikanth ,father,#parameshwarrao,died, star hospital,#chiranjeevi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *