ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్త ప్రేమాయణాలు ప్రేక్షకుల్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంటాయి. కొత్త సినిమాల్ని మించిన ఆసక్తి ఇలాంటి వ్యక్తిగత ప్రేమలపై కనబరుస్తూ ఉంటారు ప్రేక్షకులు. కొన్నాళ్లుగా
సిద్ధార్థ్ – అదితిరావు హైదరీ ప్రేమాయణం హాట్ టాపిక్‌గా మారింది. దీని గురించి బోలెడన్ని గుసగుసలు వినిపిస్తున్న సమయంలోనే… ఈ జంట కలిసి వేడుకల్లోనూ, సోషల్ మీడియాలోనూ సందడి చేయడం మొదలుపెట్టింది.దాంతో ఈ జోడీ మధ్య ఎఫైర్ కరెక్టే అని కన్ఫమ్ చేసుకున్నారు. ఇప్పుడు వీళ్లు ఎక్కడ కనిపించినా ఆ విషయం గురించే అడుగుతున్నారు. కానీ అంతే తెలివిగా వీళ్లు సమాధానం దాటవేస్తూ వస్తున్నారు. నటుడు సిద్ధార్థ్‌ని అడిగితే… “నేను ఎప్పుడైనా వ్యక్తిగత విషయాలు బయట మాట్లాడానా?“అని ఎదురు ప్రశ్నిస్తూ సమాధాన్ని దాటవేస్తున్నాడు. ఇక అదితిరావు హైదరీ ఏమో మరో టైప్ ఆన్సర్ ఇస్తోంది. మాపై ప్రేక్షకులు ఆసక్తి కనబరచడాన్ని నేనర్థం చేసుకోగలను అంటోంది తప్ప అసలు విషయం బయటపెట్టడం లేదు.
ఇటీవల ఓ ఈవెంట్ కోసం హైదరాబాద్ వచ్చిన హైదరీ ఆ విషయం గురించి మాట్లాడుతూ “నా దృష్టిలో వ్యక్తిగత జీవితమంటే వ్యక్తిగత జీవితమే. అందరినీ అన్నీ వేళల్లో పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల గురించి చాలా మంది రాస్తుంటారు. ప్రజలు మాపై చూపించే ఆదరాభిమానాలకు మురిసిపోతుంటాను.సెలబ్రిటీల జీవితాల గురించి తెలుసుకోవాలని వాళ్లు చూపించే ఆసక్తిని అర్థం చేసుకోగలను. ఇప్పటికి ఇంతే నా ఆన్సర్“ అంటూ సెలవిచ్చింది ఈ ముద్దుగుమ్మ. సిద్ధార్థ్‌కి ఇదివరకే పెళ్లయింది. ఆ తర్వాత సమంత సహా పలువురు హీరోయిన్లతో ప్రేమాయణం సాగించాడు. బ్రేకప్ అయ్యాక కొన్నాళ్లుగా ఒంటరిగా గడుపుతున్నాడు. హైదరీ స్టోరీ కూడా సేమ్ టు సేమ్. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది.