అజయ్ భూపతి నమ్మకాన్ని పెంచిన అదితి

20
aditi in ajay bhupati movie
aditi in ajay bhupati movie

aditi in ajay bhupati movie

తొలి సినిమాతోనే కమర్షియల్ గానూ, విమర్శియల్ గానూ మెప్పించిన దర్శకుడు అజయ్ భూపతి. మినిమం బడ్జెట్, బలమైన కంటెంట్ తో వచ్చిన ఆర్ఎక్స్ 100 బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. అలాంటి దర్శకులు ఎవరినైనా.. నిర్మాతలు వదలరు. అలాగే అజయ్ కి కూడా వెంటనే మరో సినిమా వచ్చింది. అదే టైమ్ లో అతని తండ్రి చనిపోవడం, తర్వాత అతను పెళ్లి చేసుకోవడంతో ఈ సినిమా బాగా ఆలస్యం అయింది. మహా సముద్రం అనే టైటిల్ తో ఓ దశలో రవితేజ, సిద్ధార్థ్ హీరోలుగా అనౌన్స్ అయింది కూడా. కానీ రవితేజ సడెన్ గా హ్యాండ్ ఇవ్వడంతో ఫైనల్ గా శర్వానంద్ తో ఫిక్స్ అయింది. కాకపోతే ఇప్పుడు మళ్లీ సిద్ధార్థ్ చేస్తున్నాడా అనేది తేలాల్సి ఉంది. అయితే ఈ కథతోనే ఇన్నాళ్లూ వెయిట్ చేయడంపై అజయ్ మీద సెటైర్స్ కూడా పడ్డాయి. అయినా అతను మాత్రం వెనకడుగు వేయలేదు. ఆ కథతోనే తర్వాతి సినిమా అంటూ ఫిక్స్ అయిపోయాడు. అతని నమ్మకాన్ని పెంచుతూ తాజాగా ఈ ప్రాజెక్ట్ లోకి అదితిరావు హైదరి జాయిన్ అయింది. శర్వానంద్ సరసన ముందుగా సమంతను తీసుకోవాలనుకున్నాడు అజయ్. కానీ ఈ కాంబో జాను రూపంలో ఫెయిల్ కావడంతో పాటు సమంత కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో తెలుగులో సమ్మోహనం తో ఆకట్టుకున్న అదితిరావు హైదరికి కథ చెప్పాడు.

నచ్చడంతో తను ఓకే చెప్పిందట. మామూలుగా అదితి ఎంచుకునే కథలు చాలా బలంగా ఉంటాయి. తన పాత్రతో పాటు స్క్రిప్ట్ కూడా బావుంటుంది. అవి కమర్శియల్ గా ఎంత విజయవంతం అవుతాయి అనేది పక్కన బెడితే కథలు మాత్రం ఆకట్టుకుంటాయి. అందుకే అజయ్ భూపతి నమ్మకానికి అదితి అదనంగా కలిసొచ్చింది. ఇక శర్వానంద్ కూడా ఎగ్జైట్ చేయకపోతే అంత సులువుగా ఒప్పుకోడు. అందువల్ల అజయ్ మహా సముద్రం ఖచ్చితంగా మరో హిట్ ప్రాజెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు. అన్నీ కుదిరితే కరోనా సమస్య మాగ్జిమం క్లియర్ అయితే వెంటనే షూటింగ్ కు వెళ్లొచ్చు అనుకున్నారు. కానీ అనూహ్యంగా అజయ్ భూపతి కరోనా పాజిటివ్ రావడంతో నిర్ణయాలు చాలా వరకూ మారే అవకాశం ఉంది. ఏదేమైనా మహాసముద్రంలో అదితిరావు ఎంట్రీ ఖచ్చితంగా పెద్ద ప్లస్ అవుతుంది. ప్రస్తుతం అదితి నటించిన ‘వి’ సినమా సెప్టెబర్ 5న అమెజాన్ లో స్ట్రీమ్ కు రెడీ అయింది.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here