ఇక విమానాలు తప్పిపోవు

AEROPLANES DIDN’T MISSING

దాదాపు ఐదేళ్ల క్రితం మలేసియా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం అదృశ్యమైన సంగతి గుర్తుందా? 239 మంది ప్రయాణికులు వెళుతున్న ఆ విమానం సముద్రంలో ఎక్కడో కూలిపోయింది. ఆ విమానం గురించి ఏకంగా మూడేళ్లపాటు వెతికినా ఆచూకీ దొరకలేదు. అలాగే రెండేళ్ల క్రితం చెన్నై నుంచి అండమాన్ బయలుదేరిన మన మిలటరీ విమానం కూడా ఇదే తరహాలో మాయమైంది. ఇలా మాయమైన విమానాల ఆచూకీ తెలుసుకోవడం కొన్ని సందర్భాల్లో సాధ్యం కావడంలేదు. ఈ నేపథ్యంలో ఇలాంటి సమస్యకు చెక్ చెప్పేందుకు సరికొత్త టెక్నాలజీ రాబోతోంది. ఇక ఏ విమానం ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్లినా.. అనుక్షణం పర్యవేక్షించే  కొత్త వ్యవస్థ వచ్చేస్తోంది. విమానం తప్పిపోయినా.. దారి మళ్లినా.. క్షణాల్లో గుర్తించి, అప్రమత్తం చేసే ఇరిడియం నెక్ట్స్‌ అనే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది.

ఇందులో భాగంగా భూమి చుట్టూ మొత్తం 75 ఉపగ్రహాలను మోహరించారు. ఇవన్నీ కలిపి భూమి చుట్టూ ఓ సాలిగూడులా ఏర్పడి విమానాల రాకపోకలను అనుక్షణం పర్యవేక్షిస్తుంటాయి. దీని వల్ల తొలిసారిగా ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వ్యవస్థకు ప్రపంచంలోని ఏ విమానం ఎక్కడుందన్న విషయం క్షణాల్లో తెలుస్తుందని అమెరికాకు చెందిన ఇరిడియం సంస్థ తెలిపింది. 2020 సరికి ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుంది. ఇప్పటివరకూ విమానం రాకపోకలను రాడార్లు, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ గ్రౌండ్‌ సిస్టం ద్వారా ట్రాక్‌ చేస్తున్నారు. విమానం కాక్‌పిట్‌లో ఉండే బ్లాక్‌ బాక్స్‌ ద్వారా ప్రతి 10 నుంచి 15 నిమిషాలకొకసారి ఈ సిగ్నల్‌ అందుతుంది. ఎంహెచ్‌ 370 విషయానికొస్తే.. ఆ బ్లాక్‌ బాక్స్‌ అన్నది దొరకనే లేదు. దీని వల్ల అసలేం జరిగిందన్నది తెలియరాలేదు. ఇరిడియం నెక్ట్స్‌ ప్రాజెక్టు అమల్లోకి వస్తే.. ఏ విమానం ఎక్కడుందో క్షణాల్లో తెలిసిపోతుంది.

TECHNOLOGY UPDATES

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article