After 14 years
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన `చంద్రముఖి` చిత్రంలో ఆయనకు జోడిగా నయనతార నటించిన సంగతి తెలిసిందే. తర్వాత శివాజీ, కథానాయకుడు చిత్రాల్లో ఒక్కొక్క పాటలో నటించి ఆకట్టుకుంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత రజనీకాంత్‌తో నయనతార జోడి కట్టనుంది. వివరాల్లోకెళ్‌తే.. రజనీ, మురుగదాస్ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా రజనీకాంత్‌తో నయనతార నటింప చేయడానికి మురుగదాస్ అండ్ యూనిట్ తమ వంతు ప్రయత్నాలు చేస్తుంది. అంతా ఓకే అయితే రజనీ 166 చిత్రంలో నయనతార హీరోయిన్‌గా కనిపిస్తుంది. ఈ సినిమా మార్చిలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
14 ఏళ్ల తర్వాత మరోసారి..
