ఆచార్యాలో .. చెర్రీ రోల్ ఇదే..

After Rangasthalam, yet another intense role for Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .. రంగస్థలంకు ముందు వరకూ అతను చిరంజీవి తనయుడు.. మాస్ హీరోగా మాత్రమే చెప్పుకున్నారు. కానీ రంగస్థలం తర్వాత రామ్ చరణ్ ఆర్టిస్ట్ అని ఒప్పుకున్నారు. ఆ రేంజ్ లో తన నటనతో ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత చరణ్ లో చాలా మెచ్యూరిటీ వచ్చిందని చెప్పుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నాడు. తర్వాత తన తండ్రి.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నిర్మిస్తోన్న సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కొరటాల శివ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీతో రామ్ చరణ్ లో మరోసారి రంగస్థలం తరహా నటన కనిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో చిరంజీవి మాజీ నక్సలైట్ పాత్రలో కనిపిస్తున్నాడంటున్నారు. అయితే ఇది పీరియాడిక్ గా సాగుతుంది. అంటే నైన్టీస్ లేట్ ఎయిటీస్ టైమ్ లో అతను నక్సలైట్ గా ఉంటాడు. మరి ఇప్పుడు మెగాస్టార్ లుక్ ను ఆ వయసుకు మార్చడం అసాధ్యం. అందుకే ఆ పాత్రను రామ్ చరణ్ తో చేయిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే అనేక సన్నివేశాల్లో రామ్ చరణ్ నటన మైండ్ బ్లోయింగ్ గా ఉండబోతోందట. ఇప్పటికే రాజమండ్రి ప్రాంతంలో షూటింగ్ జరుగుతుంది.  రామ్ చరణ్ కూడా ఈ ఎపిసోడ్ లో జాయిన్ కాబోతున్నాడంటున్నారు. మొత్తంగా ‘ఆచార్య’ అనే వర్కింగ్ టైటిల్ వినిపిస్తోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ నుంచి మరోసారి రంగస్థలం రేంజ్ నటన రాబోతోందనే వార్త మాత్రం బలంగా వినిపిస్తోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article