ఆ రెండు సినిమాలనూ మూసిన ‘ఆహా’

65
aha content
aha content

aha content

ఆహా.. మొదట్లో చాలా నెమ్మదిగా ప్రారంభమైన బిజినెస్ ను ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో కంటిన్యూ చేస్తోంది. ఓ రేంజ్ లో దూకుడు చూపిస్తూ.. చిన్న సినిమాలన్నిటీనీ కొనేస్తోంది. కాకపోతే అమెజాన్, నెట్ ఫ్లిక్స్, ఎమ్ఎక్స్ ప్లేయర్, ఆల్ట్ బాలాజీ వంటి స్ట్రీమింగ్స్ స్థాయిలో గుర్తింపైతే ఇంకా తెచ్చుకోలేదు. కాకపోతే కొత్త సినిమాలను కొనేయడంలో మాత్రం దూసుకుపోతోంది. ముఖ్యంగా కేవలం చిన్న సినిమాలపైనే ఆహా దృష్టిపెడుతుండటం విశేషం. ఈ మధ్య చాలా మూవీస్ ను తీసుకుని స్ట్రీమింగ్ కూడా చేస్తోన్న ఆహా ఇతర భాషల నుంచి కూడా కొన్ని సినిమాలను తీసుకుని డబ్ చేస్తోంది. ఈ క్రమంలో తెలుగులో ఎన్నాళ్లుగానో విడుదల కోసం చూస్తోన్న సినిమాతో పాటు రీసెంట్ గా పూర్తి చేసుకున్న ఓ సినిమాను కూడా ఆహా అక్వైర్ చేసింది. ఆల్మోస్ట్ కెరీర్ చివరి దశ అన్నట్టుగా కనిపిస్తోన్న రాజ్ తరుణ్ హీరోగా గుండెజారి గల్లంతయ్యిందే మూవీ ఫేమ్ కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘ఒరేయ్ బుజ్జిగా’సినిమాను ఆహా తీసుకుంది. అయితే నిర్మాతలు ఆశించినంత కాకపోయినా కాస్త మంచి అమౌంట్ నే పే చేశారు అని సమాచారం.

ఇక చిన్న సినిమాగా మొదలై ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోన్న ‘కలర్ ఫోటో’కూడా ఆహా తీసుకుంది. షార్ట్ ఫిల్మ్స్ నుంచి సినిమాల వరకూ ఎదిగి ప్రతిభావంతుడు అనిపించుకున్న సుహాస్ హీరోగా నటించిన సినిమా ఇది. అతన్లానే ఎదిగిన చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించింది. ఆ మధ్య విడుదలైన ఒకే టీజర్ తో ఒక్కసారిగా అందరి అటెన్షన్ సంపాదించిందీ చిత్రం. చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించే లక్షణాలున్నాయనుకున్నాడేమో అల్లు అరవింద్ ఈ చిత్రానికి డీసెంట్ అమౌంట్ నే పే చేశాడట. అతని నమ్మకం ఎంత వరకూ నిజమౌవుతుందో కానీ, ఈ దీపావళి నుంచి కలర్ ఫోటోను స్ట్రీమింగ్ లో ఉంచుతారట.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here