తెలుగు దర్శకుల సంకుచిత ధోరణి వల్లే‘ఆహా’అంటున్నారా..?

77
aha content
aha content

AHA OTT

సినిమా రంగంలో ఓ రకమైన అనిశ్చితి ఏర్పడింది ఇప్పుడు. థియేటర్స్ ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. పైగా అయినా.. మునుపటి ఆదరణ ఉంటుందా అనే గ్యారెంటీ లేదు. ఈ టైమ్ లో కొత్తగా వస్తోన్న దర్శకులే కాదు.. పాత దర్శకులు, స్టార్ డైరెక్టర్స్ సైతం మళ్లీ కొత్తగా నిర్మాతలను ఒప్పించడం కష్టమే అవుతుంది. మరోవైపు నిర్మాతలు కూడా ఇతకు ముందులా ఎక్కువ సినిమాలు చేయడానికి ధైర్యం చేస్తారనుకోలేం. అదే టైమ్ లో సినిమా పరిశ్రమకు కొత్త నిర్మాతలు రావడమూ తగ్గిపోతుంది. అందుకే ఈ దర్శకులంతా ప్రత్యామ్నాయం చూసుకోవాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తోన్న వెబ్ సిరీస్ లు, ఓటిటి ప్లాట్ ఫామ్స్ కాబట్టి.. అందరూ ఆ వైపుగా దృష్టి పెడుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోన్న ఏకైనా ఓటిటి ప్లాట్ ఫామ్ ‘ఆహా’. అల్లు అరవింద్ సారథ్యంలో మొదలైన ఈ ప్లాట్ ఫామ్ లో సినిమాలు చేసేందుకు చాలామంది కొత్తవాళ్లు, పాతవాళ్లైన దర్శకులు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు అనేవార్తలు వింటున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఓ డౌట్ వచ్చి తీరుతుంది. ఆహా ఇప్పటి వరకూ పెద్దగా సక్సెస్ అయిన ప్లాట్ ఫామ్ కాదు. రాబోయే రోజుల్లో అవుతుంది అనుకున్నా.. మన దర్శకులు కేవలం ప్రాంతీయంగానే ఆగిపోవడం వారి ఆలోచనా విస్తృతిలోని మైనస్ లను ఎత్తి చూపుతుంది.

అంటే ఎలాగూ ఓటిటి అనుకున్నప్పుడు ఆల్రెడీ సూపర్ సక్సెస్ అయిన నెట్ ఫ్లిక్స్, అమెజాన్, జీ 5 వంటి సంస్థలు ఉన్నాయి. కానీ ఆ వైపుగా ఎవరూ చూడటం లేదు. కారణం.. ఆ సంస్థలన్నీ ఖచ్చితంగా ‘అద్భుతమైన’ స్క్రిప్ట్స్ కే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కంటెంట్ కూడా యూనివర్సల్ గా ఉండాలనుకుంటాయి. ఈ రెండు విషయాల్లో వారిని మెప్పిస్తే బడ్జెట్ గురించి అస్సలు ఆలోచించే అవకాశమే లేదని ఇప్పటికే ఆ ప్లాట్ ఫామ్స్ లో వచ్చిన సిరీస్ లే నిరూపించాయి. ఇక వీళ్లు సినిమా నిర్మాణంలోనూ ఉన్నారు. కాబట్టి కనీసం రెండున్నర గంటల సినిమాతోనైనా వారిని మెప్పించలేని ‘సబ్జెక్ట్ లెస్’గా మనవాళ్లు ఉన్నారనేది వీరంతా కేవలం ఆహాకే పరిమితం కావడం చెబుతోంది. మరోవైపు అల్లు అరవింద్ కూడా కొందరు కొత్త దర్శకులను మభ్య పెడుతున్నారనీ.. ఎవరి వద్దైనా మంచి కథలు ఉంటే ఖచ్చితంగా తన ప్లాట్ ఫామ్ లోనే రూపొందించాలనే ఒత్తిడి కూడా చేస్తున్నాడు అనే రూమర్స్ కూడా వచ్చాయి.. వస్తున్నాయి. బట్.. అది సాధ్యమా అనేది కూడా ఆలోచించాలి. ఏదేమైనా మనవాళ్లు కేవలం ప్రాంతీయ కథలకే ప్రాధాన్యం ఇస్తున్నారు అనే కన్నా.. విస్తృతమైన ఆలోచనల లేమితోనే ఉన్నారు అనుకోవచ్చు.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here