ఆజాద్‌పై వేటు – ప్రియాంకకు చోటు

57
AICC New Commitee
AICC New Commitee

AICC New Commitee

ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ)ని పునర్వ్యవస్థీకరించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ)తోపాటు పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జీలను మారుస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ యువ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రాకు సీడబ్ల్యూసీలో చోటు కల్పించారు. అయితే కొద్ది రోజుల క్రితం పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్య నాయకుడు గులాం నబీ ఆజాద్‌ను సీడబ్ల్యూసీలో కొనసాగిస్తూనే… ప్రధాన కార్యదర్శి హోదా నుంచి తప్పించారు.

ఆజాద్‌తో పాటు సీనియర్‌ నాయకులు మోతీలాల్‌ వోరా, మల్లిఖార్జున ఖర్గే, అంబికా సోనీలను కూడా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవుల నుంచి తొలగించారు. 22 మందితో సీడబ్ల్యూసీని ఏర్పాటుచేయగా, పార్టీ సంస్థాగత వ్యవహారాలు, ఇతర రాజకీయ కార్యకలాపాల్లో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాకు సహాయపడేందుకు ఆరుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు.

ఇందులో పార్టీకి, గాంధీ కుటుంబానికి విధేయులైన ఆంటోనీ, అహ్మద్‌ పటేల్‌ తోపాటు అంబికా సోనీ, కేసీ వేణుగోపాల్, ముకుల్‌ వాస్నిక్, రణ్‌ దీప్‌ సింగ్‌ సూర్జేవాలాలకు చోటు కల్పించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌ చార్జిగా ఉమెన్‌ చాందీని కొనసాగించగా, తెలంగాణ ఇన్‌చార్జిని మార్చారు. తెలంగాణ ఇన్‌చార్జిగా కుంతియా స్థానంలో తమిళనాడుకు చెందిన విరుధానగర్‌ ఎంపీ మాణిక్కం టాగూర్‌ నియమితులయ్యారు. ఇక, సీడబ్ల్యూసీలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి మాజీ ఎంపీ చింతామోహన్, తెలంగాణ నుంచి ఐఎన్టీయూసీ నేత బి.సంజీవరెడ్డిలకు ప్రత్యేక ఆహ్వానితులుగా స్థానం లభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here