ఎయిర్ హోస్టెస్ లతో హైటెక్ సెక్స్ రాకెట్

204
Air Hostess forced into a sex racket in Nagpur
Air Hostess forced into a sex racket in Nagpur

Air Hostess forced into a sex racket in Nagpur

మహారాష్ట్రలోని నాగపూర్ లో  ఓయో హోటల్ కేంద్రంగా ఎయిర్ హోస్టెస్‌లతో వ్యభిచారం చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. విశ్వసనీయ సమాచారం మేరకు  పక్కా  స్కెచ్ తో సెక్స్ రాకెట్‌ బండారం బట్టబయలు చేశారు . నాగ్‌పూర్‌లోని సెంట్రల్ అవెన్యూ ప్రాంతంలో ఉన్న ఓయో హోటల్‌ లో సెక్స్ దందా నిర్వహిస్తున్న ముగ్గురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు . ఎయిర్ హోస్టెస్ ను ఎరగా వేసి సెక్స్ దందాను నిర్వహిస్తున్నారు ఈ ముఠా. విటుడి వేషంలో ఒక వ్యక్తిని పంపి ట్రాప్ చేసిన పోలీసులు తుషార్ అలియాస్ సుల్తాన్ పరస్వానీ, నీలేష్ నాగ్‌పురె, రజత్ డోంగ్రే అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మరింత లోతుగా ఈ కేసును విచారిస్తున్నారు.

ఇక ప్రధాన ముఠా నిర్వాహకుడు అయిన తుషార్ 2018లో కూడా ఇదే ఆరోపణలపై జైలుకెళ్లాడు. అయినప్పటికీ మళ్ళీ ఈ దందా కొనసాగిస్తున్నారు. ఇక ఈ వ్యభిచార దందా నిర్వహిస్తున్న తుషార్ కు కలకత్తా కు చెందిన ఏజెంట్లతో సంబంధాలు ఉన్నాయి. ఇక ఎయిర్ హోస్టెస్ తమ విధుల్లో భాగంగా ఈ హోటల్స్ లో బస చేసిన సమయంలో వీరికి విటులను పంపి దందా నిర్వహిస్తున్నారు తుషార్ . ఇక వీరి ద్వారా వ్యభిచారం చేస్తున్న ఎయిర్ హోస్టెస్ లను ఇద్దరిని కాపాడి వారిని పునరావాస కేంద్రానికి తరలించారు. ఈ తరహా దందాలు దేశంలో ప్రముఖ హోటల్స్ కేంద్రంగా జరగటం నిత్య కృత్యంగా మారింది.

Air Hostess forced into a sex racket in Nagpur,air hostes, nagapur, sex racket , oyo hotel , maharashtra , police , case

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here