ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం ఫ్రీడమ్ ఆఫర్
భారతదేశం ఆగస్టు 15న 77వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోబోతోంది. ఇండిపెండెంట్ ఉత్సవాలకోసం దేశం మొత్తం సిద్దమవుతోంది. ఈ ప్రత్యేక సందర్బాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా ఫ్రీడమ్ సేల్ ఆఫర్ ను ప్రకటించింది. కేవలం 1,947 రూపాయలకే విమాన టిక్కెట్టు ఆఫర్ చేస్తోంది ఎయిర్ ఇండియా. అలాగని ఈ ఆఫర్ కేవలం దేశీయ విమానలకు మాత్రమే అనుకుంటే పొరపాటే. అంతర్జాతీయ విమానాలకు సైతం 1,947 రూపాయల టిక్కెట్ ఆఫర్ వర్తిస్తుందని ఎయిర్ ఇండియా ప్రకటించింది.
ఈ 1,947 రూపాయల ఫ్రీడమ్ ఆఫర్ టిక్కెట్ తో ప్రయాణించే ప్రయాణికులకు 3 కిలోల వరకు ఉచిత బ్యాగేజీ తీసుకెళ్లవచ్చట. ఆ తరువాత 15 కిలోల వరకు లగేజీపై వెయ్యి రూపాయలు, 20 కిలోల వరకు లగేజీపై 1,300 డిస్కౌంట్ ను సైతం అందిస్తామని ప్రకటించింది ఎయిర్ ఇండియా. ఇక ప్రైమ్ సీట్లు, ఆహారం, పానీయాలపై 47 శాతంమేర తగ్గింపు ఉంటుందని ప్రకటించింది ఎయిర్ ఇండియా. మరింకెందుకు ఆలస్యం వెంటనే ఫ్రీడమ్ ఆఫర్ లో 1,947 రూపాలయకే మీ టిక్కెట్ ను బుక్ చేసుకొండి.