ఎయిర్‌సెల్- మ్యాక్సిస్ కు డెడ్ లైన్…

192
Aircel Maxis Case
Aircel Maxis Case

Aircel Maxis Case

ఎయిర్‌సెల్- మ్యాక్సిస్ కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ కేసు విషయంలో విచారణ పూర్తి చేయడానికి డెడ్ లైన్ పెట్టింది ఢిల్లీ హైకోర్టు. కేసు విచారణ విషయంలో జాప్యం తగదని తేల్చి చెప్పింది . ఇవాళ ఈ కేసులో విచారణ జరగగా మే 4 నాటికి విచారణ పూర్తి చేయాలంటూ సీబీఐ, ఈడీకి గడువు విధించింది కోర్టు. అయితే ఈ కేసులో నాలుగు దేశాలకు ఎల్‌ఆర్‌లు పంపించామని ,ఆ దేశాల స్పందన కోసం ఎదురుచూస్తున్నామని కోర్టుకు తెలిపింది ఈడీ. గతంలో సీబీఐ, ఈడీలు వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారంటూ గతేడాది సెప్టెంబర్ 5వ తేదీన ఈ కేసును నిరవధికంగా వాయిదా వేసింది కోర్టు.. తిరిగి.. గత నెల 28వ తేదీన పునర్విచారణ ప్రారంభించింది.  ఇక ఈ కేసు విషయంలో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో అయినా విచారణ త్వరితగతిన పూర్తి అవుతుందో లేదో వేచి చూడాలి .

Aircel Maxis Case,aircel maxis case, former minister chidambaram, delhi high court , ED, CBI ,Supreme Court Extends Deadline

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here