ప్రభాస్ మరదలిగా ఎయిర్ టెల్ పాప

33
airtel girl in prabhas movie
airtel girl in prabhas movie

airtel girl in prabhas movie

ప్రభాస్ సినిమాలో ఆఫర్ అంటే ఇప్పుడు ఏ చిన్న ఆర్టిస్ట్ కైనా చిన్న విషయం కాదు. కాస్త గుర్తింపు ఉణ్న పాత్ర దక్కినా చాలు.. జాతీయస్థాయిలో గుర్తింపు వస్తుంది. అందుకే ఆయన మూవీలో ఆఫర్ అంటే ఎవరూ వదులుకోరు. అలాంటిది కోరి వచ్చిన ఛాన్స్ ను ఎవరు కాదనుకుంటారు. అందుకే ఎయిర్ టెల్ యాడ్ తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న బ్యూటీ షాషా ఛెత్రీ కూడా ప్రభాస్ లేటెస్ట్ మూవీలో అవకాశం రాగానే ఎగిరి గంతేసింది. నిన్నటి వరకూ ఈ విషయం చాలామందికి తెలియదు. అయితే అమ్మడు ఈ సినిమాలో హీరోయిన్ కాదు. హీరోయిన్ కు చెల్లి పాత్రలో నటిస్తోంది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న రాధేశ్యామ్ అనే ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ ను రేపు ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు.

ఎన్నాళ్లుగానో ఈ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తోన్న నేపథ్యంలో ఈ వార్త వారికి చాలా కిక్ ఇచ్చింది. ఇక ఎయిర్ టెల్ బ్యూటీ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోందనే విషయం ఇండస్ట్రీలో కూడా ఆసక్తిగా మారింది. అంటే ఏ ఇమేజ్ లేని అమ్మాయిని ఏకంగా హీరోయిన్ చెల్లి పాత్రలో తీసుకోవడం ఆశ్చర్యం అనే చెప్పాలి. మొత్తంగా ఈ భామ గతంలో ఆదిసాయికుమార్ నటించిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ చిత్రంలో నటించింది. అయితే ఇందులోనూ తను మెయిన్ హీరోయిన్ కాదు. కేవలం కొన్ని పాత్రల్లో కనిపిస్తుంది. మొత్తంగా ఈ భామకు ఇది గోల్డెన్ ఆపర్చునిటీనే అనుకోవాలి.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here