పాత‌బ‌స్తీకి మెట్రో ఎప్పుడు?

68
akbaruddin Owaisi Metro Train for pata basti
akbaruddin Owaisi Metro Train for pata basti

హైదరాబాద్ కి మెట్రోరైలు వచ్చింది- పాతబస్తీ కి రాలేదని అక్బ‌రుద్దీన్ ఓవైసీ అన్నారు. హైదరాబాద్ పాతబస్తీ కి మెట్రో కావాలంటే ఢిల్లీ అనుమతి కావాలని.. అందుకే, అందరం కలిసి ఢిల్లీ వెళ్లి అనుమతి అడుగుదామ‌న్నారు. పాతబస్తీ కి బస్సులు కూడా పూర్తిగా నడవడం రావడం లేదని విమ‌ర్శించారు. హైదరాబాద్ అంతా మెట్రో నడుస్తది కానీ పాతబస్తీ అనగానే పర్యావరణ అనుమతి అడ్డు వస్తుందా అని నిల‌దీశారు. ఏళ్ల తరబడి త‌మ‌ కమ్యూనిటీ అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నానని అన్నారు. తాను అసెంబ్లీ వేదికగా అరుస్తూనే ఉన్నా.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాన‌ని తెలిపారు. త‌న కడుపు మండుతోంద‌ని ఎన్ని రోజులు బతుకుతానో తెలీద‌న్నారు. కాబట్టి, ఉన్నన్ని రోజులు త‌మ‌ కమ్యూనిటీ అభివృద్ధి కోసం కృషి చేస్తూనే ఉంటాన‌ని చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here