సీక్వెల్ సినిమాల జమానా ఇది.సినిమా హిట్ అయ్యిందంటే చాలు దానికి సీక్వెల్ తీసుకురావడంపై వెంటనే ఆలోచనలు మొదలుపెట్టేస్తున్నారు.సక్సెస్‌కి ఉన్న మహత్తు అది.ఆ క్రేజ్ ఆ పబ్లిసిటీ తర్వాత సినిమాకి కూడా ఉపయోగపడుతుందని భావించి పనులు మొదలుపెట్టేస్తున్నారు.కొంతమంది దర్శకులు సినిమా క్లైమాక్స్‌లోనే సీక్వెల్ గురించి హింట్ ఇచ్చేస్తుంటారు. బాలకృష్ణ అఖండకి కూడా సీక్వెల్ స్కోప్ ఉంది.విడుదల తర్వాత అఖండ2 ఆలోచన కూడా ఉందని హీరోబాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను స్వయంగా వెల్లడించారు.అయితే అది ఎప్పుడు ఉంటుందనేది మాత్రం ఇద్దరూ చెప్పలేదు మరోవైపు ఇద్దరూ
కూడా వాళ్ల కొత్త సినిమాలతో బిజీ అయిపోయారు.
ఈ దశలో ఉన్నట్టుండి అఖండ2`పై చర్చ ఊపందుకుంది.దానికి కారణం తమన్ ట్వీట్.శివరాత్రి సందర్భంగా తమన్ అఖండ2 సమయంలో కలుసుకుందాం అంటూ ట్వీట్ చేశారు.దాంతో ఆ సినిమా పనులు మొదలైనట్టున్నాయనే అభిప్రాయానికొస్తున్నారు బాలకృష్ణ ఫ్యాన్స్.మరి బోయపాటి రామ్‌తో కొత్త సినిమా చేస్తూనే అఖండ2 కోసం కథ సిద్ధం చేయిస్తున్నారా లేక, తమన్ అనుకోకుండా చేసిన ట్వీటా అనేది తెలియాల్సి వుంది. అయితే సూపర్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్న బాలకృష్ణ – బోయపాటి కాంబోలో సినిమా మాత్రం త్వరలోనే ఉంటుందనేది ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్న టాక్.మరి అది అఖండ2నే ఉంటుందా లేక మరో సినిమా అనే విషయాన్ని మాత్రం కాలమే నిర్ణయించాలి.