ఐదో వారంలో అఖండ జోరు

4 వారాలను పూర్తీ చేసుకుని 5వ వారంలో అడుగు పెట్టినా కానీ ఇప్పటికీ సెన్సేషనల్ కలెక్షన్స్ జోరుని కొనసాగిస్తున్న బాలయ్య అఖండ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల లో ఆల్ మోస్ట్ 131 థియేటర్స్ ని హోల్డ్ చేయ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక పక్క కొత్త సినిమాలు వారం వారం వస్తూనే ఉన్నా ఈ సినిమా సాలిడ్ గానే థియేటర్స్ ని హోల్డ్ చేసి దూసుకు పోతుంది అని చెప్పాలి. సినిమా ఇప్పుడు 30వ రోజులో ఎంటర్ అవ్వగా వీకెండ్ స్టార్ట్ అయినా ఒక పక్క కొత్త సినిమాలు ఉన్నప్పాటికీ ఇప్పటికీ జనాలు అఖండని చూడటానికి వెళుతూ ఉండటం విశేషం. ఈ రోజు కూడా హైదరాబాదులో AMB థియేటర్ లో మ్యాట్నీ షోలు హౌస్ ఫుల్ బోర్డులతో ఉండటం విశేషం కాగా ఆంధ్రలో కూడా పలు చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. అక్కడంటే టికెట్ రేట్స్ తక్కువగా ఉండటం వలన హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి అనుకున్నా నైజాంలో మల్టీ ప్లేక్స్ లో హౌస్ ఫుల్ బోర్డుతో దుమ్ము లేపడం విశేషం అనే చెప్పాలి. 5వ వీకెండ్ లో సినిమా తిరిగి బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నంతలో మంచి షేర్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article