సంక్రాంతికి అఖండ ‘ఆహా’లో

అఖండ ఓటిటి రిలీజ్ పై క్లారిటీ వచ్చేసింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఇక ఈ చిత్రం డిసెంబర్ 2న రిలీజ్ కాగా ఇప్పుడు అంతా కూడా ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ఓ టి టి రిలీజ్ పై క్లారిటీ వచ్చింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఆహా ఓటిటిలో విడుదల అవుతుందని సమాచారం. కాగా ఇంకా డేట్ పై క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్ విలన్ గా నటించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article