అఖిల్ సినిమా మార్చిలో!

Akhil Cinema starts on March

గ‌తం గ‌తః అనుకుని అఖిల్ ముంద‌డుగు వేస్తున్నాడు. మార్చిలో కొత్త చిత్రాన్ని మొద‌లుపెడుతున్నాడు. తొలి సినిమా `అఖిల్‌` ఈ అక్కినేని వార‌సుడికి చేదు అనుభ‌వాన్ని మిగిల్చింది. రెండో సినిమా `హ‌లో` కొంద‌రు విమ‌ర్శ‌కుల‌కు న‌చ్చినా, డ‌బ్బులు వెన‌క్కి తేలేక‌పోయింది. మూడో చిత్రం `మిస్ట‌ర్ మ‌జ్ను`తో అఖిల్ కెరీర్‌లో తొలి మూడు సినిమాల హ్యాట్రిక్ ఫ్లాప్ జ‌మ అయిన‌ట్ట‌యింది. అయితే వాటి నెగ‌టివిటీ నుంచి బ‌య‌ట‌ప‌డి అఖిల్ తాజాగా త‌న‌కు న‌చ్చిన‌, త‌న స్టైల్ స్పోర్ట్స్ డ్రామాను ఎంపిక చేసుకున్నారు. ఆది పినిశెట్టితో `మ‌లుపు` సినిమాను తెర‌కెక్కించిన స‌త్య‌ప్ర‌భాస్ పినిశెట్టి చెప్పిన క‌థ‌ను ఓకే చేశారు. ఆల్రెడీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఫుల్ స్వింగ్‌లో జ‌రుగుతున్నాయ‌ట‌. సో ఈ సారి త‌ప్ప‌కుండా హిట్ కొట్టాల‌నే క‌సితో ప‌నిచేస్తున్నారు అఖిల్‌.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article