అక్కినేని పిలగాడు ఇంకోటి పట్టాడు

26
akhil movie
akhil movie

akhil new movie

అక్కినేని ఫ్యామిలీ నుంచి కూడా చాలామంది హీరోలున్నారు. కాకపోతే నాగ్ తర్వాత ఆ రేంజ్ లో సత్తా చాటిన వారు కనిపించడం లేదు. ఈ తరం కుర్రాళ్ల టాలెంట్ చూస్తోంటే… చాటతారు అని కూడా చెప్పలేం. నాగ్ తర్వాత సుమంత్ మెప్పించినా.. నిలదొక్కుకోలేకపోయాడు. అటుపై నాగ్ పెద్ద కొడుకు నాగ చైతన్య వచ్చాడు. కుర్రాడు జోష్ గా ఎంట్రీ ఇచ్చినా ఆ జోష్ బాక్సాఫీస్ వద్ద చూపలేకపోయాడు. కొన్నాళ్లు మాస్ మోజులో పడి ఉన్న ఇమేజ్ లాస్ అయ్యాడు. మొత్తంగా సమంతను పెళ్లి చేసుకున్న తర్వాత సెటిల్డ్ గా మారాడు. తన ఇమేజ్ కు తగ్గ సినిమాలే చేస్తూ మెల్లగా మెప్పిస్తున్నాడు. ఇక అఖిల్ .. పాపం కుర్రాడి ఎంట్రీతోనే బ్యాడ్ మార్కులు తెచ్చుకున్నాడు. తర్వాత చేసిన హలో, మిస్టర్ మజ్ను కూడా ఫ్లాప్ గానే మిగిలిపోయాయి. దీంతో కుర్రాడు చూడ్డానికి బావున్నాడు.. ఆ ఫ్యామిలీలో మంచి డ్యాన్స్ లు వేస్తున్నాడనిపించుకుని.. తీరా సినిమాలు పోతుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు. అందుకే మూడు సినిమాల వరకూ బ్యాక్ ఎండ్ గా ఉన్నా నాగార్జున.. తర్వాత కుర్రాడిని అల్లువారి క్యాంప్ లో పెట్టాడు. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా చేస్తున్నాడు అఖిల్. మామూలుగా ఈ మూవీ సమ్మర్ చివర్లో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఆగిపోయింది.

పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. కాకపోతే ఇన్ సైడ్ గా వినిపిస్తోన్న వార్తేంటంటే.. సినిమా అనుకున్నంత గొప్పగా రాలేదట. ఇలాగే వదిలితే కుర్రాడికి మరో ఫ్లాప్ తప్పదు అనుకున్నారట. అందుకే మళ్లీ రీ షూట్ చేయాలనుకుంటున్నారని వినికిడి. అందుకే సమ్మర్ లో రావాల్సిన సినిమా కాస్తా వచ్చే సంక్రాంతికి వస్తాం అని ప్రకటించారు. అంటే మరి దానర్థం.. రీ షూట్ ఉందనే కదా. ఇక ఈ సినిమా ఇలా ఉంటే.. అఖిల్ కు మరో సినిమా ఓకే అయింది. సైరా వంటి భారీ సినిమా నుంచి స్మాలెస్ట్ హీరో అయిన అఖిల్ ను ఒప్పించేందుకు తంటాలు పడ్డాడు సురేందర్ రెడ్డి. సురేందర్ రెడ్డి సైరా తర్వాత చాలామంది స్టార్ హీరోలకు కథలు చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. కానీ అవేవీ వర్కవుట్ కాలేదు. ఫైనల్ గా అఖిల్ కోసం రాసిన కథతో నాగార్జునను ఒప్పించాడు. కథ నచ్చడంతో నాగ్ కూడా ఓకే చెప్పాడు. సో.. అఖిల్ నెక్ట్స్ ప్రాజెక్ట్ సురేందర్ రెడ్డితో ఉంటుందనేది తేలిపోయింది. ఇక ఈ చిత్రాన్ని క్రిష్ తో పాటు సురేందర్ రెడ్డి నిర్మిస్తుండటం విశేషం. మొత్తంగా అక్కినేని పిల్లగాడు మరో సినిమా పట్టాడు. మరి ఈ మూవీతో అయినా హిట్ కొడతాడేమో చూడాలి.

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here