ప్లాప్ డైరెక్ట‌ర్‌తో అఖిల్ చేస్తాడా?

AKHIL Work with FLOP Director ?

అస‌లే స‌రైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న అఖిల్ అక్కినేనికి `మిస్ట‌ర్ మ‌జ్ను` కూడా నిరాశ‌నే మిగిల్చింది. అయితే త‌దుప‌రి అఖిల్ ఎవ‌రితో సినిమా చేస్తాడ‌నే దానిపై ప‌లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. తాజాగా డైరెక్ట‌ర్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ యువ హీరో న‌టిస్తాడ‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. వైవిధ్య‌మైన సినిమాలు చేస్తాడ‌నే పేరున్న క్రిష్ గ‌త చిత్రం `య‌న్.టి.ఆర్ క‌థానాయ‌కుడు` డిజాస్ట‌ర్ అయ్యింది. అదీగాక‌.. `మ‌ణిక‌ర్ణిక‌` వివాదంలో అన‌వ‌స‌రంగా చిక్కుకున్నాడు క్రిష్‌. దీంతో నాగార్జున‌.. అఖిల్‌ను క్రిష్‌తో సినిమా చేయ‌డానికి ఒప్పుకుంటాడా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మిగిలింది. ఈ వివాదాన్ని ప‌క్క‌న పెడితే, అఖిల్‌, క్రిష్ సినిమాను నాగార్జునే నిర్మించే అవ‌కాశం ఉంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article