మంత్రి అఖిలప్రియకు గడ్డుకాలమేనా?

AKHILA FACES NEGATIVE SITUATIONS

  • ఆళ్లగడ్డలో పెరుగుతున్న వ్యతిరేకత
  • మూకుమ్మడిగా వైఎస్సార్ సీపీలో చేరుతున్న టీడీపీ నేతలు

ఏపీ మంత్రి అఖిలప్రియకు షాక్ తప్పదా? వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఆమెకు గడ్డు కాలమేనా? పరిస్థితులు చూస్తుంటే అలాగే కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి గెలుపొంది, అనంతరం తండ్రి భూమా నాగిరెడ్డితో కలిసి ఆమె పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే. అప్పట్లో భూమా కుటుంబం టీడీపీలో చేరడం స్థానిక టీడీపీ నేతలకు ఇష్టం లేకపోయినా, అధినేత సూచనలతో సర్దుకుపోయారు. అనంతరం భూమా నాగిరెడ్డి హఠాన్మరణం చెందారు. దీంతో చంద్రబాబు.. అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చారు. అయితే, హఠాత్తుగా పార్టీలోకి వచ్చి ఆధిపత్యం చెలాయిస్తున్న అఖిలపై స్థానిక టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. దీంతో అలాంటి వారంతా ప్రస్తుతం వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. ఆళ్లగడ్డ టీడీపీలో ఎప్పటినుంచో ఉన్న ఇరిగినేని రాంపుల్లారెడ్డి సోదరులు జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. వారు మంత్రి అఖిలప్రియ అవినీతికి పాల్పడుతున్నారంటూ అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేశారు. టీడీపీ ఆళ్లగడ్డ ఇన్ చార్జిగా పనిచేసిన ఇరిగెల పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అయితే మంత్రి అఖిలప్రియతో విభేదాల కారణంగా టీడీపీకి దూరంగా జరిగి, వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. మంత్రి అఖిలకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు ఒక్కటవ్వడం.. మూకుమ్మడిగా వైఎస్సార్ సీపీలో చేరుతుండటంతో అక్కడ జగన్ పార్టీ బలం పెరగింది. అదే సమయంలో టీడీపీకీ అక్కడ గడ్డు పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అఖిలకు కష్టకాలం తప్పదని విశ్లేషకులు అంటున్నారు. గెలిచే పరిస్థితి ఉంటేనే టికెట్లు ఇచ్చే చంద్రబాబు.. అఖిల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అఖిలప్రియకు వ్యతిరేకంగా సర్వే వస్తే.. టీడీపీలోనే ఆమె ప్రత్యర్థిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి వైపే బాబు మొగ్గు చూపే అవకాశం ఉంది. అదే జరిగితే అఖిలప్రియకు ఎదురుదెబ్బ తగిలినట్టే.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article