జనసేనకు ఆకుల షాక్

AKULA LEAVES JANASENA

జనసేన పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేతల్లో ఒకరిగా ఉన్న ఆకుల సత్యనారాయణ జనసేనకు గుడ్ బై చెప్పారు. గత కొంతకాలంగా అధినేత పవన్ కల్యాణ్ వైఖరిపై అసంతృప్తిగా ఉన్న ఆకుల.. శనివారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పవన్ కు పంపించారు. మరికొంత మంది నేతలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన ఘోరంగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అప్పటినుంచి పలువురు నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. రావెల కిషోర్‌బాబు, చింతల పార్థసారథి, మారంశెట్టి రాఘవయ్య, అద్దేపల్లి శ్రీధర్‌, డేవిడ్‌ రాజు జనసేనకు గుడ్‌బై చెప్పారు. తాజాగా సత్యనారాయణ కూడా పార్టీని వీడటం.. మరికొంతమంది నేతలు కూడా త్వరలోనే వెళ్లిపోతారనే ప్రచారం జరుగుతుండటంతో జనసేన శ్రేణులు ఆందోళనలో మునిగిపోయాయి.

AP POLITICS

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article