అల వైకుంఠపురములో ఆల్ టైమ్ రికార్డ్ ..

39
ala all time record
ala all time record

ala all time record

కొన్ని సినిమాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదు. నిరంతరం రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంటాయి. నిజానికి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. సినిమా లైఫ్ వీకెండ్ తో తేలిపోతుంది. బావుంటే మరో కొత్త సినిమా వచ్చే వరకూ. ఇంకా బావుంటే ఓ రెండు వారాలు. ఈ రెండు వారాల్లోనే అన్ని రికార్డులూ క్రియేట్ చేయాలి. ఒక నెల దాటితే మళ్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల. అంతే. ఇంకా అంతా ఆ సినిమా గురించి మరిచిపోతారు. కానీ ఓటిటిలో విడుదలైన ఆరు నెలల తర్వాత కూడా బుల్లితెరపై ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది.. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన అల వైకుంఠపురములో సినిమా. అల వైకుంఠపురములో.. ఓ సాధారణ కుటుంబకథా చిత్రమ్. కానీ కథనంతో మాయ చేశాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇంతకు ముందు లేని విధంగా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో అల్లు అర్జున్ మెస్మరైజ్ చేస్తే.. కళ్లు తిప్పుకోనివ్వని కాళ్ల సోయగాలతో కట్టిపడేసింది పూజాహెగ్డే. ఒక సంపన్న కుటుంబానికి చెందిన హీరో పేద ఇంట్లో పెరుగుతాడు. పేద ఇంట్లో పుట్టిన కుర్రాడు ఆ పెద్ద ఇంట్లో పెరుగుతాడు. ఈ మార్పు మొదటి సీన్ లోనే జరిగినా.. ఆ విషయం తెలిపే సన్నివేశం కాస్త అతిశయోక్తిగా అనిపించినా.. ఆడియన్స్ కు నచ్చింది.ఈ యేడాది సంక్రాంతి బరిలో నిలిచిన అల వైకుంఠపురములో సినిమాను విడుదల కంటే ముందే ఆడియన్స్ కు దగ్గర చేసింది తమన్ సంగీతం. ప్రతి పాటా యూత్ నుంచి ఓల్డ్ పీపుల్ వరకూ హమ్ చేసేలా ఉండటంతో పాటు.. అన్నీ మంచి సింపుల్ డ్యాన్స్ బిట్స్ ఉన్న బీట్స్ కావడంతో స్లైలిష్ స్టార్ చెలరేగిపోతే.. ఆ డ్యాన్స్ కు కంట్రీయే కాదు.. వరల్డ్ లో చాలామంది ఫిదా అయిపోయారు.

ఏ టిక్ టాక్ చూసినా.. రాములో రాములా నా పాణం తీసిందిరో అంటూ అన్ని దేశాల ఆడియన్స్ ఊగిపోయారు. భారీ తారాగణం కూడా సినిమాకు ప్లస్ అయింది. అయితే సినిమాలో చివరి వరకూ నాన్నలకు తమ కొడుకు ఎవరో తెలుసు. కానీ అమ్మలకు మాత్రం అసలు కొడుకు తెలియదు. ఇది త్రివిక్రమ్ మ్యాజిక్స్ లో ఒకటి. ఆ మ్యాజిక్ కు ఆడియన్స్ లాజిక్ అడక్కుండా తెరకు అతుక్కుపోయారు. మొత్తంగా ఇప్పుడు ఇదంతా ఎందుకూ అంటే.. విడుదలైన ఏడు నెలల తర్వాత.. ఓటిటిలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత కూడా అల వైకుంఠపురములో సినిమాకు బుల్లితెరపై ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలో రేటింగ్ వచ్చింది.హారిక హాసిని, గీతా ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన అల వైకుంఠపురములో చిత్రానికి తెలుగులో ఇప్పటి వరకూ మరే సినిమాకూ రానంత హయ్యొస్ట్ రేటింగ్స్ వచ్చాయి. ఈ నెల 16న జెమిని టివిలో మొదటిసారిగా ప్రసారమైన ఈ మూవీ టోటల్ గా 25.9 రేటింగ్ సాధించగా.. అర్బన్ లో ఏకంగా 29.4 రేటింగ్ సాధించింది. ఈ రెండు ఫార్మాట్స్ లోనూ ఇప్పటి వరకూ ఇదే హయ్యొస్ట్ రేటింగ్ కావడం విశేషం. ఏదైనా కొన్ని మ్యాజిక్స్ ఆగవు.. ఇలా సాగుతూనే ఉంటాయి. మరి రాబోయే రోజుల్లో ఈ మూవీ ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. 

tollywood news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here