అల వైకుంఠపురములో రివ్యూ అండ్ రేటింగ్

251
ALA VAIKUNTAPURAMULO REVIEW & RATING [TSNEWS.TV]
ALA VAIKUNTAPURAMULO REVIEW

ALA VAIKUNTAPURAMULO REVIEW

2019 సంవత్సరంలో ఒక్క చిత్రం కూడా చేయని అల్లు అర్జున్ కి 2020 చాలా కీలకమని చెప్పొచ్చు. అందుకే ఈసారి సంక్రాంతి రేసులో.. అల వైకుంఠపురములో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసే ప్రయత్నం చేశారు. ఇందుకు ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చక్కటి సహకారాన్ని అందించాడు. అన్నింటి కంటే ముఖ్యంగా, తమన్ పాటలు ఈ సినిమాకు ప్రధాన హైలెట్ అని చెప్పాలి. ఇక సినిమా కథలోకి వెళితే వెరీ రొటీన్ స్టోరీ. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన సినిమా కథను ఎంచుకున్నారు.

వాల్మీకి ఒక మిడిల్‌ క్లాస్‌ వ్యక్తి అయితే రామచంద్ర ఎంతో రిచ్. పలు కంపెనీలకు అధిపతి ఆయన. వీరిద్దరి కొడుకులు మారిపోతారు. ఈ మారిపోవడం కాన్సెప్టు దాదాపు అన్ని సినిమాల్లో చూశాం. అంతెందుకు చిరంజీవి రౌడీ అల్లుడు సినిమాలో కూడా అటు ఇటు మారిపోవడాన్ని మనలో చాలామంది చూసే ఉంటారు. కాకపోతే, అందులో కొడుకు కాదనుకోండి. ధనవంతుడి కొడుకు అయినప్పటికీ వాల్మీకి వద్ద మధ్యతరగతి అబ్బాయిగా పెరుగుతాడు. వాల్మీకి కొడుకు ధనవంతుడిగా రామచంద్ర వద్ద పెరుగుతాడు. మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిగా బన్నీ అనేక కష్టాలు పడుతాడు. చివరకు ప్రేమించిన అమ్మాయి కూడా దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బన్నీ తన అసలు తండ్రి ఇల్లు వైకుంఠపురంలోకి అడుగుపెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడాలంటే తప్పకుండా సినిమా చూడాల్సిందే. ధనవంతుడిగా పుట్టిన బాబు మధ్యతరగతి ఇంట్లో ఎందుకు పెరిగాడనేది కీలకాంశం.

నటీనటుల నటన
అల్లు అర్జున్ యాక్టింగ్లో ఇరగదీశాడు. ఇందులో ఎలాంటి డౌటు లేదు. కాస్త డిఫరెంట్ మ్యానరిజంతో ఆకర్షించాడు. సాధారణంగానే డ్యాన్స్ లో దుమ్మురేపాడు. ఫైట్స్ లో ఇరగదీయడం వెరీ కామన్. హీరోయిన్ తో రొమాంటిక్ సీన్లు యూత్ కి విశేషంగా నచ్చుతాయి. పూజా హెగ్డేకు చాలా తక్కువ స్కోప్‌ ఉందీ చిత్రంలో. ఆమె ఉన్నంతలో ఫర్వాలేదు అన్నట్లుగా చేసింది. స్కిన్‌ షోతో ఆకట్టుకుంది. మురళి శర్మ, జయరామ్‌లు ఆకట్టుకున్నారు. తమిళ నటుడు సముద్రఖని విభిన్నమైన మ్యానరిజం చూపెట్టాడు. సునీల్‌ కామెడీకి పెద్ద ప్రాధాన్యత లేదు.

థమన్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాను రిచ్‌ లుక్‌లో చూపించడంలో సినిమాటోగ్రఫీ కీలకంగా మారింది.  ఎడిటింగ్‌లో చిన్న చిన్న లోపాలు స్పష్టంగా కనిపించాయి. సెకండ్‌ హాఫ్‌లో సీన్స్‌ను ట్రిమ్‌ చేస్తే బాగుండేది. దర్శకుడు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే విషయంలో కొత్తగా ట్రై చేస్తే బాగుండేదనిపించింది

జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమాల్లో మాదిరిగా హీరో ఆదర్శవంతమైన కొడుకులా కనిపిస్తాడు. కాకపోతే, ఈ సినిమా చూస్తున్నంత సేపు త్రివిక్రమ్‌ గతంలో చేసిన ఏదో ఒక సినిమాలోని సీన్స్‌ చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది. అల్లు అర్జున్‌ను ఎంటర్‌టైనర్‌ జోనర్‌లో చూపించాలని త్రివిక్రమ్‌ ప్లాన్ చేశాడని అనిపిస్తుంది. కాకపోతే, ఇది చాలా చిన్న పాయింట్ అని చెప్పొచ్చు. దాన్ని ఎలాబ్రేట్‌ చేయడంలో దర్శకుడు త్రివిక్రమ్‌ విఫలం అయ్యాడనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త బెటర్‌గా చేస్తే బాగుండేది. సాదా సీదా మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌గా ఉన్నా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందీ సినిమా.

ప్లస్‌ పాయింట్స్‌
అల్లు అర్జున్‌, పూజా హెగ్డే రొమాంటిక్ సన్నివేశాలు
పాటలు
సినిమాటోగ్రఫీ
కొన్ని డైలాగ్స్‌
స్టోరీలో ట్విస్ట్‌
స్టోరీ లైన్‌

మైనస్‌ పాయింట్స్‌
స్క్రీన్‌ప్లే
ఎడిటింగ్‌
సెకండ్‌ హాఫ్‌
త్రివిక్రమ్‌ గత చిత్రాలతో పోలిక

రేటింగ్‌ : 3/5.0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here