ఫిషర్‌మెన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆల్ ఇండియా ఫిషర్‌మెన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పాల్గొన్నారు. ఇందులో బిజెపి ప్రభుత్వం మత్స్యకారులకు వ్యతిరేకంగా తెచ్చిన బిల్లులపై నిరసన తెలియజేశారు.
దీంతోపాటు బిజెపి ప్రభుత్వం మత్స్యకారులను చిన్నచూపు చూస్తోందని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అల్ ఇండియా ఫిషర్‌మెన్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఫర్నేడో, జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపి ప్రతాపన్ సహా ఇతర కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.