అల్లు అర్జున్ సందడి మొదలైంది

ALLU ARJUN 20
‘‘ఏమబ్బా అందరూ బాగుండారా.. మీరు ఎప్పుడెప్పుడా అని చూస్తాండే ఏఏ20 అప్డేట్ .. ఏప్రిల్ 8న, తెల్లార్తో 9 గంటలకు వస్తాండాది.. రెడీ కాండబ్బా..’’ ఇదీ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా గురించి ఆ టీమ్ ముందుగానే ఇచ్చిన అప్డేట్.. అదిరిపోయిండ్లా.. నిజమే. ఈ కాంబినేషన్ లో వస్తోన్న థర్డ్ మూవీ ఇది. మామూలుగా అయితే ఇంతకు మించిన సౌండ్ కనిపించాలి. కానీ సిట్యుయేషన్స్ బాలేదు కదా.. అందుకే కూతంత నిమ్మళంగా ఉండాదేమో యవ్వారం.. ఇంతకీ ఇషయం చెప్పలేదు గదో .. రేపు అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఆ సందర్భంగా సినిమా నుంచి ఏదో ఒక గిఫ్ట్ ఫ్యాన్స్ కు ఇస్తాడా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ను ఖుషీ చేయడంలో బన్నీ ముందుంటాడు కదా.. అందుకే ఇప్పుడున్న సిట్యుయేషన్ లో వాళ్లలో కాస్త జోష్ తేవాల్నని ఈ ప్రయత్నం చేస్తున్నాడు. చిత్తూరు ప్రాంతంలోని శేషాచలం కొండల్లో సాగే ఎర్రచందనం స్మగులింగ్ నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో కనిపిస్తాడు. ఇందుకోసం అతని మేకోవర్ కూడా చాలా రగ్గ్ డ్ గా ఉండబోతోంది. అయితే తన బర్త్ డే సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ కూడా అనౌన్స్ చేయబోతున్నారు. అంటే రేపు ఉదయం నుంచి బన్నీ బర్త్ డే సంబరాలు ఫ్యాన్స్ లో మొదలవుతాయన్నమాట.
అయితే ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తోన్న హాట్ హాట్ న్యూస్ టైటిల్. ఓ టాప్ హీరో, మరో టాప్ డైరెక్టర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ ఇది. పైగా కంటెంట్ కూడా ఊరమాస్ అని అర్థమౌతోంది. కానీ అందుకు భిన్నంగా వీళ్లు మాత్రం పూర్తిగా ఎవ్వరూ ఊహించని విధమైన టైటిల్ అనుకుంటున్నారట.. మరి ఆ టైటిల్ ఏంటో తెలుసా.. ‘‘పుష్ప’.. ఇదే టైటిల్ అని చెబుతున్నారు. పుష్ప అనే టైటిల్ ఇప్పటి వరకూ ఏ సినిమాకూ వినిపించలేదు. ఏ సినిమాలో కనీసం హీరోయిన్ పేరుగా కూడా కనిపించలేదు. అయినా ఈ టైటిల్ వైపు ఎందుకు వెళుతున్నారూ అంటే దీని వెనక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ వినిపిస్తోంది. ఈ పేరు అల్లు అర్జున్ తల్లిది. సినిమా గురించి ఎన్ని వార్తలు వస్తున్నా.. ఈ చిత్రంలో ఆమె పాత్ర చుట్టూనే కథ తిరుగుతుందట. పైగా ఇలాంటి సినిమా చేయడానికి ఏ హీరోకైనా దమ్ముండాలి అంటున్నారు. ఇంకా చెబితే పుష్పలాంటి లేడీ కొడుకు హీరోఅంటే ఇది ఖచ్చితంగా ఆడియన్స్ ను షాకింగ్ ఎలిమెంట్ అనేది టీమ్ నుంచి వినిపిస్తోన్న మాట.
ఒకవేళ ఇదే టైటిల్ ఉండకపోయినా.. ఈ పేరుకు సినిమాలో అత్యంత ప్రాధాన్యం ఉంటుంది.. అది మాత్రం గ్యారెంటీ. సినిమా ఎలా ఉన్నా.. ఆ పుష్ప కొడుకు పాత్ర చేయడానికి ఒప్పుకున్న అల్లు అర్జున్ గురించి మాత్రం ఓ రేంజ్ లో చెప్పుకుంటారు అనేలా ఉంటుందట అతని పాత్ర. చూద్దాం.. సుకుమార్ టైటిల్స్ కూ ఓ లెక్క ఉంటుంది కదా.. మరి ఈ టైటిల్ లెక్క ఎలా ఉండబోతోందో..?
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article