అల్లు అర్జున్, సుకుమార్ టైటిల్ ఇదేనా

Allu Arjun- Sukumar film Titled Seshachalam?

మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో మరో హ్యాట్రిక్ మూవీ రాబోతోంది కదా.. ఇప్పటికే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. బన్నీ లేని కొన్ని సీన్స్ ను కూడా సుకుమార్ సెకండ్ యూనిట్ చిత్రీకరిస్తుందని చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అయితే సుకుమార్ రీసెంట్  మూవీ ‘రంగస్థలం’లో కీలక పాత్రలో మెప్పించిన బ్యూటీఫుల్ ఆంటీ అనసూయను మరోసారి రిపీట్ చేస్తున్నాడు సుక్కూ. యస్.. ఈ మూవీలో అనసూయ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తుందట.

ఇక విశేషం ఏంటంటే.. రంగస్థలం లాగానే ఈ చిత్రంలో కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో అద్భుతమైన సీన్స్ ఉంటాయంటున్నారు. హీరోయిన్ రష్మిక కూడా రంగస్థలంలో సమంతలా ఇన్నోసెంట్ విలేజ్ గాళ్ గానే కనిపిస్తుందని టాక్. మొత్తంగా ఈ చిత్రానికి ఓ వెరైటీ టైటిల్ అనుకుంటున్నారట.

‘శేషాచలం’.. ఇదే ఈ చిత్రానికి టైటిల్ అంటున్నారు. మామూలుగా శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం దొంగల ముఠా నేపథ్యంలోనే కథ నడుస్తుంది. కాబట్టి ఈ టైటిల్ కరెక్ట్ గా ఉంటుందనుకున్నారట. అలాగే సౌండ్ కూడా బావుంది. అటు భక్తి భావమూ ఉంది. వింటేజ్ సౌండ్ తో పాటు తమ కథకూ కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అందుకే ఈ టైటిల్ తోనే వెళ్లాలనే ప్లాన్ లో ఉన్నారట. ఒకవేళ బన్నీ అండ్ టీమ్ ఈ టైటిల్ వద్దంటే మరో మూడు పేర్లు కూడా సిద్ధం చేసుకున్నాడట సుక్కూ. మొత్తంగా సుకుమార్ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడట.

Allu Arjun- Sukumar film Titled Seshachalam?,Rashmika,Anasuya,Rangasthalam,Village Backdrop,Red Sandal,Sukumar,Allu Arjun,Seshachalam,A Vintage Title For Allu Arjun

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article