Allu Arjun With Chiru Heroin
ఘరానా మొగుడు, ముగ్గురు మొనగాళ్ళు, రిక్షావోడు.. ఇలా చిరంజీవి చిత్రాల్లో తనదైన గ్లామర్‌తో మెప్పించిన హీరోయిన్ నగ్మా తదనంతరం అల్లరి రాముడు చిత్రంలో ఎన్టీఆర్ అత్త పాత్రలో నటించింది. తర్వాత రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటించడానికి నగ్మ రెడీ అవుతున్నారని సమాచారం. వివరాల ప్రకారం నగ్మను బన్ని, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందబోయే హ్యాట్రిక్ చిత్రంలో బన్ని తల్లి పాత్ర కోసం సంప్రదించారట. బాలీవుడ్ నటుడు బొమన్ ఇరాని బన్ని తండ్రి పాత్రలో నటిస్తారని సమాచారం. గీతాఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో సెట్స్‌కు వెళుతుందని టాక్.
For More Click Here
More Latest Interesting news