Wednesday, April 16, 2025

అట్లీ..అర్జున్‌ @ ముగ్గురు భామలు

కట్‌ చేసిన వీడియో చిన్నది. కానీ వీడియోలో విషయం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఇంతకీ ఏంటి దేని గురించి చెబుతున్నాం అనుకుంటున్నారా… అదే స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌,అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్‌ పనులు ఆల్రెడీ మొదలయ్యాయి. ఇకపోతే సినిమాకు సిజి పనులు చాలా ఉన్నాయి. అందుకే మేకర్స్‌ చాలా ప్లానింగ్‌తో ముందుకు వెళుతున్నారు. ఇక అల్లుఅర్జున్‌తో నటించేందుకు హీరోయిన్ల కోసం వేట మొదలైంది. హీరోయిన్లు అంటున్నారేంటి అనుకుంటున్నారా… ఈ చిత్రంలో ఐకాన్‌స్టార్‌తో నటించడానికి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ముగ్గు హీరోయిన్ల అవసరం ఉంది. ముగ్గురిలో ప్రధాన పాత్ర ఎవరిది మిగతా ఇద్దరికి ఏమాత్రం ప్రాముఖ్యత ఉంటుంది అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఒక హీరోయిన్‌గా జాన్వీ అయితే మిగతా ఇద్దరి కోసం ఎవరి డేట్లు వీలుగా ఉంటాయి అని ఆలోచిస్తున్నారు మేకర్స్‌.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com