టీడీపీ కి ఆమంచి షాక్ ఇచ్చారు

AMANCHI SHOCK TO TDP

వైసీపీలోకి ఆమంచి … టీడీపీ కి షాక్

టీడీపీ కి ఆమంచి షాక్ ఇచ్చారు . చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టిడిపికి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరాలని ప్రయత్నం చేస్తున్నారనే వార్త నిజమైంది. ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మారకుండా చూడడానికి సాక్షాత్తు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. చీరాల నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన ఆమంచి కృష్ణమోహన్ తదుపరి కాలంలో టిడిపిలో చేరారు. టిడిపిలో చేరిన నాటి నుండి ఆమంచి కృష్ణమోహన్ స్థానిక టిడిపి నేతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోతుల సునీత వర్గం చీరాల నియోజకవర్గంలో ఆధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో అసంతృప్తి వ్యక్తం చేసిన కృష్ణమోహన్ ఈ విషయంపై చంద్రబాబుకు సైతం పలుమార్లు విన్నవించారు. అయినా ఫలితం లేకపోవడంతో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బుధవారం నాడు హైద్రాబాద్‌ లోటస్‌పాండ్‌లో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. ఇవాళ ఉదయమే ఆయన టీడీపీకి రాజీనామా చేశారు.
చీరాల నియోజకవర్గంలో చోటు చేసుకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి గుడ్‌బై చెప్పారు. వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. కుటుంబసభ్యులతో కలిసి బుధవారం నాడు ఆమంచి కృష్ణమోహన్ హైద్రాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో జగన్‌తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో టిడిపి పార్టీ క్యాడర్ దెబ్బతినకుండా ఉండేందుకు అప్రమత్తమైన చంద్రబాబు చీరాల నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని ఎమ్మెల్సీ కరణం బలరామ్‌ను ఆదేశించారు. గురువారం నాడు చీరాలలో పార్టీ కార్యకర్తలతో కరణం బలరామ్ సమావేశం కానున్నారు. ఇక చీరాల నుండి టికెట్ సైతం కరణం బలరాం కు ఇవ్వనున్నట్లు గా ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనప్పటికీ ఆమంచి కృష్ణమోహన్ పార్టీ వీడి వెళ్ళడం ఎన్నికలు దగ్గర పడిన ఈ సమయంలో టిడిపికి నష్టం చేకూర్చనుంది.

For More Click Here

More Latest Interesting news
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article