సీఎంలు మారితే రాజధాని మారుస్తారా

142
Amaravathi Farmers Protest On Jagan 3 Capital
Amaravathi Farmers Protest On Jagan 3 Capital

Amaravathi Farmers Protest On Jagan 3 Capital

ఏపీ అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని పై జరిగిన చర్చలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచనప్రాయంగా తన అభిప్రాయాన్ని తెలిపారు. దీంతో ఏపీలో రాజకీయ దుమారం రేగింది. రాజధాని రైతులు సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు ప్రాంతాల మధ్య విద్వేషాలు రగిలించే పని సీఎం వ్యాఖ్యలు చేశారని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి గా మారిన మాత్రాన రాజధానిని మారుస్తారా అంటూ రాజధాని రైతులు నిప్పులు చెరుగుతున్నారు. ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనను నిరసిస్తూ బుధవారం ఉదయం మందడం గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు ముందు రాజధాని మార్పు ప్రకటన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అమరావతి నిర్మాణానికి డబ్బులు లేవన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధాని నిర్మాణం ఎట్లా చేస్తారని రైతులు నిలదీస్తున్నారు . అమరావతి నిర్మాణం కోసం 35 వేల ఎకరాలు భూమి ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు .

Amaravathi Farmers Protest On Jagan 3 Capital,#capitalcontroversy,#ThreeCapitals, amaravati, jagan , capital area farmers

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here