రాజధాని రైతుల ఆందోళన..నేడు వంటావార్పు….

198
Amaravati Farmers Hold Vanta-Varpu
Amaravati Farmers Hold Vanta-Varpu

Amaravati Farmers Hold Vanta-Varpu Againsts CM Jagan

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటనపై అమరావతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మూడవ రోజు ఆందోళన చేస్తున్న రైతులు సీఎం జగన్మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తుళ్లూరులో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రాజధాని రైతుల విషయంలో వైసీపీ మంత్రులు చేస్తున్న ప్రకటనలు తమన్నా ఆవేదనకు గురి చేస్తున్నాయని వారంటున్నారు. నేడు తుళ్లూరు లో ఆందోళన చేపట్టిన రైతులు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. తుళ్లూరు లోని రైతు కుటుంబాలు రోడ్ల మీదకు వచ్చి తమ నిరసనను తెలియజేశారు. మహిళలు వంటావార్పు చేసి ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక తుళ్లూరు లో నిరసన కార్యక్రమాలతో రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిపివేశారు. రైతుల ఆందోళనలతో సచివాలయానికి రాకపోకలు నిలిచిపోయాయి.

అటు వెలగపూడిలో రాజధాని రైతుల రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. 3 రాజధానులు వద్దు – అమరావతే ముద్దు అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తాము చేసిన త్యాగాలను అవమానించొద్దంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మందడం గ్రామంలో రైతులు మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు మిగతా గ్రామాల్లోని రైతులు తరలివస్తున్నారు.రోడ్లమీదే వంటలు చేసి, అందరూ భోజనాలు చేసి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయబోతున్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల ఆలోచనను విరమించుకోవాలని రాజధాని ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Amaravati Farmers Hold Vanta-Varpu Againsts CM Jagan,ap capital, three capitals, farmers protest, cm jagan , velagapudi, tulluru, amaravati, mandadam

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here