ఏపీ సచివాలయాన్ని ముట్టడించిన రైతులు

139
Amaravati Farmers Reached AP Assembly And Secretariat
Amaravati Farmers Reached AP Assembly And Secretariat

Amaravati Farmers Reached AP Assembly And Secretariat

ఏపీ రాజధాని విషయంలో 33 రోజుల ఉత్కంఠ ముగిసింది. సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయంతో కథ  క్లైమాక్స్‌కు చేరింది. సీఆర్డీఏ ఉపసంహరణ, అధికార వికేంద్రీకరణ బిల్లులతో సహా పలు కీలక నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం  తెలిపింది. అంతే కాదు  అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 8 వేల మంది పోలీసులు సచివాలయం చుట్టూ మోహరించినప్పటికీ  రాజధాని రైతులు, మహిళలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు . పంట పొలాల్లో నుంచి దూసుకొచ్చి నాలుగు వైపులా దిగ్బంధనం చేశారు.

తుళ్లూరు రైతులు సచివాలయం వెనుక గేటును ముట్టడి చేసేందుకు యత్నించగా.. మల్కాపురం రైతులు ముందు గేటును ముట్టడించారు . శాఖమూరు, ఐనవోలు రైతులు కుడివైపు గేటును ముట్టడించారు. అటు రైతులను అడ్డుకోవడానికి పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇక రైతులను అడ్డుకోటానికి  పలుచోట్ల వారిని పోలీసులు లాఠీఛార్జ్ జరిపి చెదరగొట్టారు. దీనితో సచివాలయం ఎదుట కాలువలోకి దిగి రైతులు, మహిళలు నిరసనకు దిగారు. రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Amaravati Farmers Reached AP Assembly And Secretariat,ap capital , three capitals, cabinet meet, ap assembly session

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here