అమరావతి కోసం ..మేడారం వెళ్లి మొక్కులు

109
amaravati farmers visits medaram
amaravati farmers visits medaram

amaravati farmers visits medaram jatara over 3 capitals

ఏపీలో రాజధాని అమరావతి కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి .  సీఎం జగన్ మాత్రం మూడు రాజధానుల ఏర్పాటుకు శరవేగంగా పావులు కదుపుతున్నారు. ఏపీకి 3 రాజధానులు వద్దు.. అమరావతియే ముద్దు అని ఆందోళన చేస్తున్న అమరావతి రైతులు తాజాగా సమ్మక్క-సారలమ్మలు కొలువైన మేడారంలో ప్రత్యక్షమయ్యారు. వనదేవతలను దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా మేడారంలో అమరావతియే ఏపీకి రాజధానిగా ఉండాలని..  3 రాజధానులు ఏర్పాటు చేయకుండా సీఎం జగన్ మనసు మార్చాలని కోరుతూ నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు.కోరిన కోర్కెలు తీర్చే సమ్మక్క-సారలమ్మలకు మొక్కుకుంటే తమ సమస్యలు తీరుతాయని ఇక్కడికి వచ్చినట్టు మేడారం రైతులు  చెప్పుకున్నారు .శుక్రవారం రైతులంతా అమరావతి నుంచి ప్రత్యేక బస్సుల్లో మేడారానికి బయల్దేరారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వీరంతా వనదేవతలను వేడుకున్నారు. మొక్కులు చెల్లించి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరారు.

amaravati farmers visits medaram jatara over 3 capitals ,Capital farmers, Medaram , Sammakkamma Saralamma, jaggery , bangaram , prayers , capital amaravati

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here