మా చావులను అంగీకరించండి .. రాష్ట్రపతికి లేఖలు

116
Amaravati farmers write to President
Amaravati farmers write to President

Amaravati farmers write to President

అమరావతి ప్రాంత రైతులు ప్రజలు ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాజధాని ప్రాంతంలో ఆందోళనలు సాగిస్తున్నారు . ఏపీ సీఎం జగన్ ఏపీకి మూడు రాజధానులు నిర్ణయానికి  వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు 16 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఎన్ని విధాలుగా ప్రభుత్వం సర్ది చెప్పాలని చెప్పినప్పటికీ కూడా రైతులు వెనక్కి తగ్గడంలేదు. దీనికి తోడు టీడీపీ జనసేన నేతలు కూడా రైతులకి మద్దతు  తెలుపుతూ  వారి నిరసనలతో పాల్గొనడంతో  వీరి ఆందోళనలు మరింత కొనసాగుతున్నాయి .

రాజధాని విషయంలో జరుగుతున్న ఆందోళనలకు ప్రభుత్వం స్పందించకపోవటంతో కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతికి రాజధాని రైతులు లేఖలు రాశారు.  మోసపోయిన తమకు కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ రాష్ట్రపతికి అమరావతి రైతుల లేఖలు రాసారు. అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ మాట మార్చారని వారు తమ లేఖల్లో వాపోయారు. ఇప్పటికే తమ ఆందోళనను స్వయంగా కలిసి రాష్ట్రపతికి వివరించిన రైతులు..ఇప్పుడు లేఖల ద్వారా కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరటం సంచలనంగా మారింది. జాతీయ స్థాయిలో ఇప్పటికే ఏపీ రాజధానుల వ్యవహారం పైన చర్చ సాగుతోంది. తాజాగా రైతుల ఈ లేఖలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. అర్థరాత్రి మా ఇళ్లపైకి పోలీసులను పంపి అరెస్టులు చేస్తున్నారని అండగా నిలవాల్సిన ప్రభుత్వ మే మాపై కక్ష కట్టిందని రాజధాని పొతే తాము జీవచ్ఛవాలుగా మిగిలిపోతామని.. మరణమే శరణ్యమంటూ రాష్ట్రపతికి లేఖలో తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు రాజధాని ప్రాంత రైతులు. కేవలం ముఖ్యమంత్రి.. పలువురు వ్యక్తుల స్వలాభం కోసం రాజధానిని విశాఖకు తరలించే కుట్ర చేస్తున్నారంటూ ఆ లేఖల్లో తెలిపారు. రాజధాని మార్చవద్దంటూ మా కుటుంబాలతో కలిసి ఇన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నా తమను పట్టించుకున్నవారు లేరంటూ ఆవేదన వ్యక్తం చేసారు. దయచేసి మెర్సీ కిల్లింగ్ కు అంగీకరించాలని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here