మెగాస్టార్ కు రాజధాని సెగ ..

Amaravati JAC to Protest in Front of Chiranjeevi House

మెగా స్టార్ చిరంజీవి మూడు రాజధానులకు మద్దతుగా ప్రకటన చేసినప్పటి నుండి రాజధాని ప్రాంత రైతులు మెగా స్టార్ మీద ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే . ఇక రాజధానిగా అమరావతిని కొనసాగించేలా మెగాస్టార్ చిరంజీవి మద్దతు తెలపాలని కోరుతూ అమరావతి యువసేన జేఏసీ ఈ నెల 29న ఆయన ఇంటి ముందు నిరాహార దీక్షకు సిద్ధమైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఓ ప్రకటనను కూడా జేఏసీ విడుదల చేసింది. హైదరాబాద్‌లోని చిరంజీవి ఇంటి ముందు ఉదయం 10గం. నుంచి సాయంత్రం 5గం.ల వరకు నిరాహార దీక్ష చేపట్టబోతున్నట్లు అందులో వారు వెల్లడించారు. ఇది కాస్త వైరల్‌గా మారగా.. దీనిపై తాజాగా జేఏసీ స్పష్టతను ఇచ్చింది.

ఈ దీక్ష అమరావతి రాజధానికి మద్దతు పలకమని చిరంజీవిని మర్యాదపూర్వకంగా కోరడానికి మాత్రమేనని జేఏసీ తెలిపింది. ‘‘చిరంజీవి గారు మూడు రాజధానులకు మద్దతు తెలపారని బాధతో ఒకటే రాష్ట్రము, ఒకటే రాజధానికి, రైతుల త్యాగాలను గురించి వివరించి మద్దతు పలికేలా శాంతియుతంగా వినతి పత్రం ఇవ్వాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని’’ వారు అన్నారు. ఇప్పటికైనా రైతుల త్యాగాలను గౌరవించి చిరంజీవి గారు రైతుల పక్షాల నిలబడుతామని ఆశిస్తున్నామని వారు చెప్పారు .గతంలో మహేష్ బాబు, ఫిలిం ఛాంబర్ వద్ద నిరసన తెలిపినట్లే మెగాస్టార్‌ను కలిసి శాంతియుత మార్గంలో వివరించాలన్న సదుద్దేశంలో ఈ కార్యక్రమం పెట్టాలనుకున్నామని వారు పేర్కొన్నారు. అయితే కొంతమంది కులాలను ఆపాదిస్తూ కుల ప్రస్తావన తెచ్చి వక్రీకరించి ప్రచారం చేయడం పట్ల చింతిస్తూ కార్యక్రమాన్ని విరమించుకుంటున్నామని వారు వెల్లడించారు.

Amaravati JAC to Protest in Front of Chiranjeevi House,andhra pradesh, capital amaravati, amaravati farmers , three capitals

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article