ఎ.ఎం.బి సినిమాస్‌లో అవ‌క‌త‌వ‌క‌లు

AMB Cinemas problems
సినిమాల్లో హీరోగానే కాకుండా సినిమా రంగానికి ప‌రిచ‌య‌మున్న ప్ర‌తి చోట మ‌హేష్ త‌న‌దైన రీతిలో పాగా వేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవ‌ల ఆయ‌న ఎ.ఎం.బి సినిమాస్‌లో భాగ‌మైన సంగ‌తి తెలిసిందే. ఎ.ఎం.బి సినిమాస్‌కు చాలా మంచి పేరు వ‌చ్చింది. ఇలాంటి త‌రుణంలో ఎ.ఎం.బి సినిమాస్‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు వార్త‌లు వస్తున్నాయి. వివ‌రాల్లోకెళ్తే.. జ‌న‌వ‌రి 1 నుండి కేంద్ర ప్ర‌భుత్వం సినిమా టికెట్స్‌పై జి.ఎస్.టి 28  శాతం నుండి 18 శాతానికి త‌గ్గించింది. అయితే యాజ‌మాన్యం ఈ మొత్తాన్ని టికెట్స్‌పై త‌గ్గించ‌లేద‌ట‌. ఈ మొత్తం 35 లక్ష‌లు అని తేలినట్లు టాక్‌. మ‌రి దీనిపై స‌ద‌రు యాజ‌మాన్యం ఏమ‌ని స్పందిస్తుందో చూడాలి.

Check out here For More News

For More Interesting and offers

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article