Amir Khan New Movie
ఆమీర్ ఖాన్ `మొఘల్` సినిమాను చేస్తారా? చేయరా? అనేది ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్. మ్యూజిక్ మొఘల్ గుల్షన్ కుమార్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నారు. గుల్షన్ కుమార్ తనయుడు భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా కోసం ముందు అక్షయ్ కుమార్‌ను సంప్రదించారు. అయితే స్క్రిప్ట్ పరమైన అంశాల వల్ల అక్షయ్ నటించడానికి ముందుకు రాలేదు. దర్శకుడిగా సుభాష్ కపూర్ పేరు కూడా వినిపించింది. అయితే `మీటూ ` ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. అందువల్ల ఈ సినిమా కాస్త ఆగింది. కానీ భూషణ్ కుమార్ ఇప్పుడు ఆమీర్‌ను ఈ సినిమా చేయడానికి ఒప్పుకోమని సంప్రదిస్తున్నారట. నటించడానికి ఆమీర్ దాదాపుగా అంగీకరించినట్టుగానే అర్థమవుతోంది. కానీ భూషణ్ అతన్ని డైరక్షన్ కూడా చేయమని అడుగుతున్నారట. ఒకవేళ ఆమీర్ దానికి కూడా అంగీకరిస్తే అనుకున్నదానికన్నా ఈ సినిమా పెద్ద బజ్‌ను క్రియేట్ చేస్తుందని అర్థం చేసుకోవచ్చు.