త‌న బ‌యోపిక్‌కి అత‌నే కరెక్ట్ అంటున్న ఆమిర్‌

Amir Khan Son Coming soon to Bollywood
ప్ర‌స్తుతం బ‌యోపిక్స్ ట్రెండ్ న‌డుస్తోంది. మ‌రి మీ బ‌యోపిక్‌లో ఎవ‌రు న‌టిస్తే బావుంటుంది? అని బాలీవుడ్‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేసే బాలీవుడ్‌ సూప‌ర్‌స్టార్ ఆమిర్ ఖాన్‌ని మీడియా ప్ర‌శ్నిస్తే.. ఆయ‌న ఏమాత్రం ఆలోచ‌న లేకుండా త‌న కొడుకు జునైద్ పేరును ప్రస్తావించాడు. “జునైద్ ఎంట్రీ కోసం మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నాను. నా బ‌యోపిక్‌లో త‌నైతే క‌రెక్ట్‌. త‌ను న‌ట‌న‌లో శిక్ష‌ణ పొందాడు. ఏడాదిగా థియేట‌ర్స్‌లో న‌టిస్తున్నాడు. అయితే త‌ను హీరోగానే న‌టించ‌కుండా ఆ పాత్ర‌లో జీవిస్తే బావుంటుంది. అందులో ఆనందం వేరుగా ఉంటుంది. దాన్ని అంద‌ర‌రూ అర్థం చేసుకుంటే బావుంటుంది“ అన్నారు ఆమిర్‌.
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article